iDreamPost
android-app
ios-app

హారర్ మూవీస్ ఇష్టమా? OTTలో ఈ మూవీని ఒంటరిగా చూస్తే మీరు తోపే!

  • Published May 24, 2024 | 8:08 AM Updated Updated May 24, 2024 | 8:08 AM

OTT Suggestions- Best Horror Movie: ఓటీటీలు మీకు హారర్ సినిమాలు చూడటం అలవాటు అయితే మాత్రం ఈ సినిమాని అస్సలు వదిలిపెట్టద్దు. ఇలాంటి సినిమాని చాలా రోజులు మిస్ అయ్యామే అనే భావన కలుగుతుంది.

OTT Suggestions- Best Horror Movie: ఓటీటీలు మీకు హారర్ సినిమాలు చూడటం అలవాటు అయితే మాత్రం ఈ సినిమాని అస్సలు వదిలిపెట్టద్దు. ఇలాంటి సినిమాని చాలా రోజులు మిస్ అయ్యామే అనే భావన కలుగుతుంది.

  • Published May 24, 2024 | 8:08 AMUpdated May 24, 2024 | 8:08 AM
హారర్ మూవీస్ ఇష్టమా? OTTలో ఈ మూవీని ఒంటరిగా చూస్తే మీరు తోపే!

మీకు హారర్ సినిమాలు చూసే అలవాటు ఉందా? ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి హారర్ సినిమాలు చూశారా? అయితే మీకోసం ఒక హారర్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాం. ఇది నిజంగానే భయంపుట్టించేలాగే ఉంటుంది. అందుకే మీరు ఈ సినిమాని ఒంటరిగా చూస్తే హారర్ సినిమాలు చూడటంలో మీరు తోపులు అని చెప్పుకోవచ్చు. ఇంత హైప్ ఇస్తున్నారు అక్కడ ఏం ఉండదు అని లైట్ తీసుకోవద్దు. ఇది నిజంగానే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మరి.. ఆ సినిమా ఏది? అంత భయం పుట్టించే విషయాలు ఆ మూవీలో ఏమున్నాయి. నిజంగానే భయమేస్తుందా? అనే విషయాలు చూద్దాం.

హారర్ సినిమా అనగానే అందరూ ఒక చీకటి గది, భయంకరమైన మ్యూజిక్, భయంకరమైన నీడలు ఇలాంటివి కోరుకుంటారు. అలాంటివి ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. పైగా మ్యూజిక్ మీకు ఎక్కువ భయం కలిగిస్తుంది. ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. హారర్ ఎలిమెంట్ కంటే కూడా కథ, ట్విస్టులు, సస్పెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో సీన్ కి బుర్రపాడై పిచ్చోళ్లు అయిపోతారు. అలాగని భయం వేయదు అని మాత్రం అనుకోవద్దు. ఆ విషయంలో అస్సలు తగ్గేదేలే. ఈ సినిమాకి కథే హీరో. మీరు ఈ సినిమా చూడటం స్టార్ట్ చేశాక.. మధ్యలో ఆపడం మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. కథ అంత ఎంగేజింగ్ గా ఉంటుంది.

ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే.. గోస్ట్ గేమ్. మీరు రోమాంచం సినిమా చూశారా? అందులో ఒక గేమ్ ఆడతారు. గదిలో ఆత్మ ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక వింత కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ తో వీళ్లు ఈ ఆట ఆడతారు. అయితే వారికి మొదట్లో ఈ ఆట సరదాగానే అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత వారి లైఫ్ లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వారికి కొన్ని ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి ఎర్ర చీర కట్టుకుని వారి ఇంట్లో తిరిగుతూ, ఏడుస్తూ ఉంటుంది.

అసలు ఆ యువతి ఎవరు? వారికి ఆ కాయిన్ ఎక్కడ దొరికింది? ఆ గేమ్ ఆడితే దెయ్యం నిజంగానే వచ్చిందా? వారికి ఆ దెయ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు, సమాధానాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ‘పోచండి’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాకపోతే ఇది కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కాకపోతే మీరు సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడచ్చు. తమిళ్ రాదు అని లైట్ తీసుకుంటే మంచి మూవీని మిస్ అయిపోతారు. మరి.. ఈ పోచండి సినిమా ఇప్పటికే చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom