iDreamPost
android-app
ios-app

దెయ్యాలతో యువతి పోరాటం.. ఈ హారర్ చిత్రానికి తడిసిపోతుంది..!

OTT Suggestions- Best Horror Movie Kumari: హారర్ చిత్రాలు అంటే మీకు ఇష్టం ఉందా? అయితే మీరు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. ఒక్కరే చూస్తే మాత్రం భయంతో వణికిపోవాల్సిందే.

OTT Suggestions- Best Horror Movie Kumari: హారర్ చిత్రాలు అంటే మీకు ఇష్టం ఉందా? అయితే మీరు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే. ఒక్కరే చూస్తే మాత్రం భయంతో వణికిపోవాల్సిందే.

దెయ్యాలతో యువతి పోరాటం.. ఈ హారర్ చిత్రానికి తడిసిపోతుంది..!

ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ కొన్ని చిత్రాలను తప్పకుండా చూస్తున్నారు. ఆ కేటగిరీలో హారర్ చిత్రం అయితే తప్పకుండా ఉంటుంది. అందుకో మీకోసం ఒక స్పెషల్ మూవీ తీసుకొచ్చాం. అందులో ఆ మూవీ తెలుగులోనే ఉంది. మీరు హాలీవుడ్ చిత్రాలు చూసి అమ్మో భయమేస్తుంది అంటారు. కానీ, సరిగ్గా తీసిన ఇండియన్ హారర్ మూవీ చూస్తే హాలీవుడ్ చిత్రాలు ఎందుకూ పనికిరావు. అలాంటి సరైన కంటెంట్ ఉన్నదే ఈ చిత్రం. సినిమా మాత్రం సరిగ్గా ఉంటుంది. కానీ, ఒంటరిగా చూస్తే మాత్రం కాస్త కంగారుగానే ఉంటుంది. పైగా రాత్రి పూట చూస్తే ఇంక అంతే సంగతులు. ఎందుకంటే మూవీలో ఎక్కువ నైట్ విజువల్స్.. మంటలు, కాగడాలు ఉంటాయి. ఊరికే భయపడే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాని ఒక డిఫరెంట్ నరేషన్ లో తీసుకెళ్లారు. మీరు కాజల్ నటించి కాజల్ కార్తీక వెబ్ సిరీస్ చూసుంటే దానిలో కూడా ఇలాంటి నరేషనే ఉంటుంది. ఒకరు పుస్తకం చదువుతూ ఉంటారు. ఆ పుస్తకంలో ఉన్న కథను మనకు చూపిస్తూ ఉంటారు. ఆ హీరో చెప్తున్న కథను మనం చూస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ప్రెజెంట్ సిట్చ్యువేషన్స్ ని కూడా చూపిస్తూ ఉంటారు. పైగా ఈ సినిమాలో మంచి స్టార్ కాస్ట్ ఉంది. ముఖ్యంగా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సాధారణంగానే మలయాళం చిత్రం అంటే మంచి యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్లుగానే మంచి మంచి యాక్టర్స్ ని తీసుకున్నారు. ఇంకేముంది ఆ మూవీ రిజల్ట్ ఇలా మనం మాట్లాడుకునేలా చేసింది.

Kumari

ఓటీటీలు మీరు ఇప్పటివరకు చానాలనే హారర్ చిత్రాలను చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక మూవీని మాత్రం కచ్చితంగా చూసుండరు. కథ మొత్తం ఒక ఊరి చుట్టూ ఆ ఊరిలో ఉన్న జనం, అక్కడి ఆచారాలు, కట్టుబాట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొత్తవాళ్లు అక్కడికి వెళ్లాలి అన్నా కంగారు పడిపోతారు. అలాంటి ఊరికి కోడలిగా హీరోయిన్ వెళ్తుంది. అయితే ఆమెకు తెలియదు ఆ ఊరు, ఆ నేల, అక్కడి దేవుళ్లు, దెయ్యాలు ఆమె రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి అని. అలా కోడలిగా ఆమె అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరిలో ఎవరి ఊహకీ అందని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు చనిపోతూ ఉంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు.

ఆ మారుమూల పల్లెటూరిలో చాలానే రహస్యాలు దాగి ఉంటాయి. వాటి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. అసలు ఆ ఊరికి హీరోయిన్ కి ఉన్న సంబంధం ఏంటి? ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? అక్కడ నిజంగానే దెయ్యాలు, దేవతలు ఉన్నారా? ఈమె వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా మారాయి? ఇలాంటి చాలానే ప్రశ్నలు మీ మదిలో మెదులవుతాయి. ఈ సినిమా పేరు కుమారి. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి