OTT Suggestions- Best Family Drama: భార్యపై అనుమానంతో ఆ భర్త.. OTTలో కుటుంబంతో కలిసి చూడాల్సిన సిరీస్!

భార్యపై అనుమానంతో ఆ భర్త.. OTTలో కుటుంబంతో కలిసి చూడాల్సిన సిరీస్!

OTT Suggestions- Must Watch Family Drama: కొన్ని సినిమాలను కచ్చితంగా కుటుంబంతో కలిసి చూడాలి. అలాంటి వాటిలో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. కచ్చితంగా దీనిని ఫ్యామిలీతో కలిసి చూడండి.

OTT Suggestions- Must Watch Family Drama: కొన్ని సినిమాలను కచ్చితంగా కుటుంబంతో కలిసి చూడాలి. అలాంటి వాటిలో ఈ వెబ్ సిరీస్ కూడా ఒకటి. కచ్చితంగా దీనిని ఫ్యామిలీతో కలిసి చూడండి.

ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే బాగున్నాయి అనిపిస్తాయి. కానీ, ఇంకొన్ని సినిమాలు మాత్రం కచ్చితంగా కుటుంబం మొత్తం కలిసి చూడాల్సినవి ఉంటాయి. అలాంటి ఒక వెబ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. నిజంగా ఇది అందరినీ ఎంత ఆలోచింపజేస్తుంది అంటే.. ఒక భార్య ఇంట్లో పడే నరకయాతనను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక్కోసారి యదాలాపంగా మనం అనే మాటలు అవతలి వారిని ఎంతలా బాధపెడతాయో.. ఈ సిరీస్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. భార్య అంటే కేవలం పని మనిషి కాదు అనే విషయం కూడా అర్థమవుతుంది. మరి.. ఈ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

మీరు ఇప్పటివరకు ఎన్నో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చూసుంటారు. కానీ, ఇది తప్పక చూడాల్సిన ఒక వెబ్ సిరీస్. ముఖ్యంగా పెళ్లైన వాళ్లు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్లు, అత్తలు, అమ్మలు, కూతుళ్లు ఇలా ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. అలాగే మీ వాళ్లకు చూపించాల్సిన సిరీస్ కూడా. ఒక యువతి పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన కుటుంబం కోసం పడే కష్టం, ఆ కుటుంబం కోసం ఆమె భరించే బాధను ఎంతో చక్కగా చూపించారు. అయితే భార్యను దేవతలా కాకపోయినా.. ఒక మనిషిగా కూడా చూడని వ్యక్తితో సంసారం ఎంత కష్టంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు.

అలాగే నవ మాసాలు మోసి కని పెంచిన కుమార్తె.. తల్లిని ఒక పిచ్చి దానిలా చూస్తూ ఉంటే ఆమె పడే నరకయాతన ఈ సిరీస్ లో కనిపిస్తుంది. కూతురు కోసం ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉంటే.. ఆఖరికి ఆ కూతురే నువ్వు నాకొద్దు అంటే.. అప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఒక అత్త కోడలికి మంచి చేయకపోయినా పర్వాలేదు. కానీ, కోడలు కాపురం తీయాలని చూస్తే? ఒక భర్త తన ఫ్రెండ్స్ కి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు. కానీ, నా భార్య ఒక చేతకాని మొద్దు అంటే ఆమె మైండ్ ఎలా ఉంటుంది? ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటివి ఇందులో చాలానే ఉంటాయి.

ఇన్ని ఇబ్బందులు, అవమానాలు, ఛీత్కారాలు ఆ మహిళ ఎందుకు భరించింది? ఎన్నాళ్లు భరించింది? చివరికి ప్రతిఘటించిందా లేదా? తన జీవితాన్ని తాను జీవించిందా? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ బెంగాలీ ఉండబట్టే మన ఆడియన్స్ కు అంతగా తెలియలేదు. కానీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ పేరు ‘Lojja’. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన వెబ్ సిరీస్.

Show comments