iDreamPost
android-app
ios-app

శవాలతో సావాసం.. మిస్టరీలతో చెలగాటం.. OTTలో ఈ లేడీ చాలా డేంజర్!

  • Published Jun 08, 2024 | 7:45 PM Updated Updated Jun 09, 2024 | 5:13 PM

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత మీరు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. కానీ, ఇది మాత్రం కాస్త స్పెషల్ గానే ఉంటుంది. మీకు లిస్ట్ లో బెస్ట్ మూవీ కూడా కావచ్చు. మరి.. ఆ సినిమా ఏంటో చూద్దాం.

OTT Suggestions- Best Crime Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత మీరు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. కానీ, ఇది మాత్రం కాస్త స్పెషల్ గానే ఉంటుంది. మీకు లిస్ట్ లో బెస్ట్ మూవీ కూడా కావచ్చు. మరి.. ఆ సినిమా ఏంటో చూద్దాం.

  • Published Jun 08, 2024 | 7:45 PMUpdated Jun 09, 2024 | 5:13 PM
శవాలతో సావాసం.. మిస్టరీలతో చెలగాటం.. OTTలో ఈ లేడీ చాలా డేంజర్!

కొన్ని సినిమాలు చూసిన వెంటనే మర్చిపోతాం. కొన్ని సినిమాలు మాత్రం చూసిన కొన్ని నెలల తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఒక చిత్రాన్ని మీకోసం సజీషన్ గా తీసుకొచ్చాం. ఈ సినిమాని మీరు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఎందుకంటే ఈ కథ అలాంటిది. హత్యలు, యాక్సిడెంట్స్, శవాలు, వాటి చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ ఇలా ఈ చిత్రం మీకు కచ్చితంగా నచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ సిరీస్లో ఉండే ట్విస్టులు మీకు బుర్ర గిర్రున తిరిగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా లీడ్ యాక్టర్స్ చేసే యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు. ఇది కచ్చితంగా ఒక భిన్నమైన కథ అని చెప్పచ్చు.

ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే.. నిర్మాత కూడా ఆ లేడీ హీరోయిన్ కావడం. ఈ సినిమా గురించి మీరు వినే ఉంటారు. కానీ, చూడకపోతే మాత్రం కచ్చితంగా ట్రై చేయచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొన్ని అనుమానాస్పద మృతులు పోలీసులకు సవాళ్లు విసురుతాయి. అయితే అవి హత్యలా? ఆత్మహత్యలా? అనే విషయం అర్థం కాదు. కానీ, త్వరగానే హత్యలు అనే విషయం క్లారిటీ వస్తుంది. కానీ, వారికి కావాల్సిన ఆధారాలు దొరకవు. మరోవైపు ఆ హత్యకు అనుబంధం మరిన్ని హత్యలు జరగడం కలవర పెడుతుంది. ఈ హత్య కేసులను ఛేదించేందుకు పోలీసులకు హీరోయిన్ సహాయం అవసరం అవుతుంది.

హీరోయిన్ మార్చురీలో పోస్టుమార్టం చేసే స్పెషలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె గనుక ఒకసారి ఎగ్జామిన్ చేస్తే.. అసలు ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? అనే విషయాలను బల్లగుద్ది చెప్పేస్తారు. అలాంటి హీరోయిన్ సహాయంతో పోలీసులు మొండి కేసు వెనుక పడతారు. అయితే ఆ హంతకుడు మరింత తెలివిగలవాడు కావడం.. పోలీసులకు ఎలాంటి క్లూస్ లేకుండా వారిని ముప్పతిప్పలు పెడతాడు. కానీ, ఎప్పుడైతే హీరోయిన్ కేసులోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి అసలు సిసలు కథ మొదలవుతుంది. హంతకుడిని పట్టించేందుకు కావాల్సిన అన్ని ఆధారాలను వెతుకుతూ ఉంటుంది. వాడిని పట్టించేందుకు చాలానే కృషి చేస్తుంది.

ఇంక ఈ సినిమాలో హత్యకు గురైన వారి ఫ్లాష్ బ్యాక్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. ఆ1 భార్యాభర్తల కథ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ సినిమా పేరు మరేదో కాదు.. కడవర్. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కడవర్ సినిమాలో స్టార్ హీరోయిన్ అమలా పాల్ లీడ్ రోల్ ప్లే చేసింది. అలాగే ఈ సినిమాకి నిర్మాత కూడా అమలా పాలే. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మీకు అమలా పాల్ యాక్టింగ్ బాగా నచ్చేస్తుంది. షార్ట్ హెయిర్ తో, శవాల మధ్య అమలా పాల్ చేసిన యాక్టింగ్ కచ్చితంగా మెప్పిస్తుంది. మరి.. మీరు ఈ సినిమా చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss