iDreamPost
android-app
ios-app

నరాలు తెగే ఉత్కంఠ.. OTTలో బెస్ట్ కాప్ డ్రామా!

  • Published Jul 15, 2024 | 8:39 PM Updated Updated Jul 15, 2024 | 8:39 PM

OTT Suggestions- Best Cop Drama Monsoon Shooting: ఒక బెస్ట్ పోలీస్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. కచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తుంది.

OTT Suggestions- Best Cop Drama Monsoon Shooting: ఒక బెస్ట్ పోలీస్ యాక్షన్ డ్రామా చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. కచ్చితంగా మిమ్మల్ని మెప్పిస్తుంది.

  • Published Jul 15, 2024 | 8:39 PMUpdated Jul 15, 2024 | 8:39 PM
నరాలు తెగే ఉత్కంఠ.. OTTలో బెస్ట్ కాప్ డ్రామా!

సినిమా ఎప్పుడు ఉత్కంఠగా మారుతుంది అంటే.. ఆ సినిమా కథలో కంటెంట్ ఉన్నప్పుడు. అలాగే ఆ సినిమాపై ఆడియన్ ఆసక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే.. ఆ కథకు తగినట్లుగా బలమైన నటుడు దొరికినప్పుడు. ఇప్పుడు చెప్పుకునే సినిమా అలాంటి ఒక పవర్ ఫుల్ స్టోరీస్ అండ్ సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ గురించే. ఓటీటీ సజీషన్స్ లో ఇది కూడా ఒక బెస్ట్ డ్రామా అవుతుంది. ఇందులో పెద్దగా యాక్షన్ ఉండకపోవచ్చు.. కానీ, ఒక మనిషి ఆలోచన ఉంటుంది. మన మెదడుకు పదును పెట్టే సందర్భాలు ఉంటాయి. మనల్ని మనం ఆ పాత్రలో ఊహించుకుంటాం. అక్కడ మనమే ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

కాప్ స్టోరీస్ అంటే సహజంగానే పాన్ ఇండియా ఆడియన్స్ కు ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలామంది యాక్షన్ కాప్స్ ని చూశాం. అయితే ఈ యంగ్ కాప్ మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇతను ఆవేశంతో కాకుండా.. ఆలోచనతో పనిచేస్తూ ఉంటాడు. అయితే వాళ్ల డిపార్టుమెంట్లో ఉండాల్సిన దూకుడు అతనిలో లేదని అంతా తిడుతూ ఉంటారు. అయితే సింపుల్ గా ట్రిగర్ నొక్కేసి ఒకడి ప్రాణం తీశాక.. అతను దోషి కాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఆ హీరో ప్రశ్న. అలాంటి ఒక డైలమా అతనికి మొదటి కేసులోనే రావడం ఇక్కడ విశేషం. ఎందుకంటే డిపార్టుమెంట్లో చేరిన తొలి కేసులోనే కాల్చాలా? వద్దా? అనే సందిగ్దంలో పడిపోతాడు.

ఒక పేరు మోసిన విలన్ చుట్టూ పోలీసులు తిరుగుతూ ఉంటారు. కానీ, అతడి దగ్గరకు కూడా వెళ్లలేరు. అలాంటి విలన్ మన హీరోకి కళ్ల ముందే నిల్చుంటాడు. అలాంటి వాడి గురించి తెలియక మన హీరో వదిలేస్తాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు అయిపోతుంది. అతని కెరీర్ నే ప్రమాదంలోకి నెడుతుంది. తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసర్. చాలా నిజాయితీగా డిపార్టుమెంట్లో పని చేశాడు. ఆయన అడుగుజాడల్లో నడవాలి అనేది ఈ కొడుకు పాలసీ. కానీ, అదే అతనికి లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటాయి.

ఈ సినిమాలో రెండు పాత్రల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. హీరోగా చేసిన విజయ్ వర్మా గురించి. అలాగే విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి. వీళ్ల యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే ఇండస్ట్రీలో తామేంటో నిరూపించుకున్నారు. అలాంటి విలక్షణ నటులు ఇద్దరూ ఎదురుబొదురుగా నటిస్తుంటే ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోతారు. ఈ సినిమా పేరు మాన్ సూన్ షూటింగ్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom