iDreamPost
android-app
ios-app

ఒక హీరో నలుగురు నాన్నలు.. OTTలో ఈ సిరీస్ కి పొట్ట చక్కలవుతుంది!

  • Published Jul 02, 2024 | 6:14 PM Updated Updated Jul 02, 2024 | 6:14 PM

OTT Suggestions- Best Comedy Drama Baap Kaun: కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే కడుపుబ్బా నవ్వేసుకుంటారు.

OTT Suggestions- Best Comedy Drama Baap Kaun: కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఏకంగా ఒక వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఇది స్టార్ట్ చేస్తే కడుపుబ్బా నవ్వేసుకుంటారు.

  • Published Jul 02, 2024 | 6:14 PMUpdated Jul 02, 2024 | 6:14 PM
ఒక హీరో నలుగురు నాన్నలు.. OTTలో ఈ సిరీస్ కి పొట్ట చక్కలవుతుంది!

ఓటీటీల్లో చాలా మంది కామెడీ సినిమాలు కావాలి అని తెగ వెతుకుతూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు ట్రైలర్స్ చూసి మోసపోతూ ఉంటారు. కానీ, ఈసారి మీకోసం ఒక బెస్ట్ కామెడీ మూవీనే కాదు.. ఏకంగా సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్ ఒకసారి స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు నవ్వుతూనే ఉంటారు. అది కూడా అలా ఇలా కాదండోయ్.. పొట్ట చక్కలయ్యేలా నవ్వుతారు. అది కూడా ఏకంగా 12 ఎపిసోడ్లు ఉన్నాయి. అంటే కనీసం మూడు రోజులు మీకు ఎంటర్ టైన్మెంట్ పక్కా అనమాట. మరి.. ఆ కామెడీ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది. అంత పడి పడి నవ్వుకునే అంత కథ ఏముందో తెలుసుకుందాం.

సాధారణంగానే ఇలాంటి సినిమాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఎందుకంటే అందులో ఉండే స్టోరీ లైన్ అలా ఉంటుంది. అంటే ఒక హీరోకి ఒకరు కాదు.. నలుగురు తండ్రులు ఉంటారు. ఇలాంటి పాయింట్స్ మీద చాలా అరుదుగా మూవీస్ వస్తూ ఉంటాయి. అందులోనూ ఇది సిరీస్ కావడం మరో విశేషం. మన హీరో చిన్నప్పుడు స్కూల్ లో చాలా సరదాగా ఒక ప్రసంగం ఇస్తాడు. అది తన జీవితంలో నిజం అయిపోతుంది. అంటే స్కూల్ టీచర్ అడిగిన దానికి ఏమీ రాయడు. అందుకని ఫ్రెండ్ రాసిన దానిని మక్కీకి మక్కీ చెప్పేస్తాడు. అయితే అతను ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తే.. హీరో మాత్రం తనకు ఎక్కువ మంది తండ్రులు ఉన్నారు అంటాడు. ఆ తర్వాత అదే నిజం కూడా అవుతుంది.

ఈ సిరీస్ ని నిర్మించింది టాలీవుడ్ లో కాదులెండి.. ఇది వచ్చింది బాలీవుడ్ లో. అయితే ఎక్కడ వచ్చినా కూడా కామెడీ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. హీరో చైల్డ్ హుడ్ నుంచి పెద్దవాడు అయ్యి.. ఒక అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి అనుకునే వరకు కూడా ఎక్కడా డౌన్ కాకుండా ఫుల్ లెంగ్త్ కామెడీ నడుస్తూ ఉంటుంది. అయితే అతని పెళ్లికి తన తండ్రి పెద్ద సమస్యగా మారుతాడు. అతను అప్పటి వరకు ఒక ఎంపీ కుమారుడిని అనుకుంటాడు. కానీ, అతను ఎంపీ కుమారుడు కాదు అని తెలుస్తుంది.

ఆ ఎంపీ తన తండ్రి ఒక బాడీగార్డ్ అని చెప్తాడు. అక్కడ చూస్తే అతను కూడా కాదు అని తేలుతుంది. అతను మరొక పేరు చెప్పడం చేస్తాడు. ఇలా మొత్తం ఒక హీరోకి దాదాపుగా నలుగురు నాన్నలు తేలతారు. వారిలో అసలు నాన్న ఎవరు? అసలు తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందా? తన ఒరిజినల్ తండ్రిని కనుగుంటాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ పేరు ‘బాప్ కౌన్?’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet