iDreamPost
android-app
ios-app

ఏలియన్ తో స్నేహం.. OTTలో పిచ్చెక్కించే కామెడీ మూవీ!

  • Published Jul 03, 2024 | 9:56 PM Updated Updated Jul 03, 2024 | 9:56 PM

OTT Suggestions- Best Alien Comedy Movie Paul: ఏలియన్ కామెడీ మూవీ కావాలి అంటే మాత్రం మీరు ఈ సినిమాని అస్సలు మిస్ కాకూడదు. ఓటీటీలోనే బెస్ట్ కామెడీ మూవీ ఇది. ఇందులో కామెడీ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా కావాల్సినంత ఉంటుంది.

OTT Suggestions- Best Alien Comedy Movie Paul: ఏలియన్ కామెడీ మూవీ కావాలి అంటే మాత్రం మీరు ఈ సినిమాని అస్సలు మిస్ కాకూడదు. ఓటీటీలోనే బెస్ట్ కామెడీ మూవీ ఇది. ఇందులో కామెడీ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా కావాల్సినంత ఉంటుంది.

  • Published Jul 03, 2024 | 9:56 PMUpdated Jul 03, 2024 | 9:56 PM
ఏలియన్ తో స్నేహం.. OTTలో పిచ్చెక్కించే కామెడీ మూవీ!

ఓటీటీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి యాక్షన్ మూవీస్ మాత్రమే కాదు.. ఎన్నో కామెడీ మూవీస్ కూడా ఉన్నాయి. ఆ లిస్టులోకి ఈ సినిమా కచ్చితంగా చేరుతుంది. పైగా ఇది అలాంటి ఇలాంటి కామెడీ మూవీ కాదు.. ఏలియన్ కామెడీ చిత్రం. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఎన్నో కామెడీ చిత్రాలు వచ్చాయి. కానీ, ఇది మాత్రం కచ్చితంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. మరి.. ఈ ఏలియన్ కామెడీ చిత్రంలో అంత స్పెషల్ ఏముంది? అసలు ఈ ఏలియన్ ఎందుకు భూమి మీదకు వచ్చింది? ఆ కథ ఏంటి? అసలు ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఏలియన్ పాయింట్ మీద ప్రపంచంలో చాలా భాషల నుంచి చాలానే సినిమాలు వచ్చాయి. ఇండియాలో కూడా చాలా అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన పీకే కచ్చితంగా ఉంటుంది. అలాగే హాలీవుడ్ లో కూడా చాలానే ఏలియన్ యాక్షన్ మూవీస్ వచ్చాయి. వాటిలో చాలా వరకు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఏలియన్ కామెడీ బేస్ట్ మాత్రం చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. వాటికి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం కూడా అలాంటిదే. ఇద్దరు మిత్రులు కలిసి ఒక ఏలియన్ ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తారు. అందుకోసం వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడతారు.

ఈ మూవీలో ఇద్దరు మిత్రులు ఉంటారు. వాళ్లు ఏలియన్స్ తిరుగుతూ ఉండే ప్రాంతం అని చెప్పే ప్రదేశానికి వెళ్తారు. అక్కడికి ఏలియన్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఏలియన్ ని చూడాలి అని అక్కడకు వెళ్తారు. అయితే అక్కడ అలాంటివి ఉండవు అనేది వారి నమ్మకం. కానీ, వారికి నిజంగానే ఒక ఏలియన్ కనిపిస్తుంది. అది గ్రీన్ కలర్లో పెద్ద తలకాయతో.. చేతికి కేవలం నాలుగు వేళ్లు మాత్రమే ఉంటాయి. దానిని చూసి మొదట వాళ్లు నమ్మరు. కానీ, తర్వాత నమ్మడమే కాకుండా.. దానితో ఫ్రెండ్ షిప్ కూడా చేస్తారు. ఆ ఏలియన్ పేరు పాల్.

అయితే ఏలియన్ వచ్చింది అంటే కచ్చితంగా సీక్రెట్ సర్వీసెస్ వాళ్లు, ఏలియన్ హంటర్స్ కూడా కచ్చితంగా వస్తారు. అలా వారి వెంట కొందరు పడుతూ ఉంటారు. ఆ ఏలియన్ ను సురక్షితంగా వారి ప్లానెట్ కి పంపేందుకు ఈ ఇద్దరు చాలానే ప్రయత్నాలు చేస్తారు. అందులో వారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. మరి.. చివరికి ఆ ఏలియన్ ను కాపాడారా? ఆ ఏలియన్ వల్ల ఎవరికైనా హాని జరిగిందా? అనేది తెలియాలి అంటే మీరు ఈ పాల్ అనే మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే ఈ పాల్ మూవీ చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet