OTT Suggestions- Best Action Packed Web Series: ప్రపంచం కోసం ఒంటరి పోరాటం.. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

ప్రపంచం కోసం ఒంటరి పోరాటం.. ఈ సిరీస్ స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం!

OTT Suggestions- Best Action Packed Web Series: మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉందా? మీకోసం ఒక క్రేజీ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ఒకటి తీసుకొచ్చాం. ఇప్పటివరకు మీరు ఈ సిరీస్ చూడకపోయి ఉంటే.. ఒక మంచి సిరీస్ మిస్ అయినట్లే.

OTT Suggestions- Best Action Packed Web Series: మీకు వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉందా? మీకోసం ఒక క్రేజీ యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ ఒకటి తీసుకొచ్చాం. ఇప్పటివరకు మీరు ఈ సిరీస్ చూడకపోయి ఉంటే.. ఒక మంచి సిరీస్ మిస్ అయినట్లే.

ఓటీటీలు వచ్చిన తర్వాత ఎక్కువ మంది వెబ్ సిరీస్లు చూసేందుకు అలవాటు పడిపోయారు. అలా వెబ్ సిరీస్లు చూసే వారికి ఒక్కోసారి మంచి సిరీస్లు దొరికే ఛాన్స్ ఉంటదు. కానీ, స్టార్ట్ చేసిన తర్వాత తప్పకన చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మీకోసం మేము ఒక అద్భుతమైన యాక్షన్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస చూసిన తర్వాత మీరు కచ్చితంగా వావ్ అనేస్తారు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ ఆ రేంజ్ లో ఉంటుంది. పైగా ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. ఎమోషన్, డ్రామా, ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి. వాటికి మించి ఈ వెబ్ సిరీస్లో మిమ్మల్ని ఎంగేజ్ చేసే పాయింట్ ఉంటుంది. అదే ప్రపంచానికి వచ్చిన కష్టం.

సాధారణంగా సినిమా అయినా.. వెబ్ సిరీస్ అయినా యాక్షన్, ఎమోషన్ ఉంటే ఆడియన్స్ కు బాగా నచ్చేస్తుంది. అలాంటి పాయిట్స్ అయితే ఈ సిరీస్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్ లో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కథ మొత్తం హీరో సెంట్రిక్ గానే తిరుగుతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే కావాల్సినంత ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ లో టన్నుల కొద్దీ యాక్షన్, ఎమోషన్, చూడాలి అనే ఒక ఇంట్రస్ట్ ఉంటుంది. నిజానికి మీరు ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అనే చెప్పాలి. మొత్తం ఇందులో 5 సీజన్స్ ఉన్నాయి. ఏ సీజన్ కి అది టాప్ నాచ్ గా ఉంటుంది. ఎక్కడా కూడా మీ ఎక్స్ పెక్టేషన్స్ తగ్గించదు.

ఈ సిరీస్ లో సీజన్ కి ఒక కొత్త సమస్య వస్తూ ఉంటుంది. మొదటి సీజన్లో ఒక పెద్ద విపత్తు వస్తుంది. ఆ విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ వైరస్ కి టీకా కనుగొనేందుకు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో కొన్ని దేశాలు ఆ క్యూర్ ని సొంతం చేసుకునేందుకు యుద్ధానికి, దాడులకు కూడా దిగుతూ ఉంటుంది. అలా మొదలైన సిరీస్ ఒక్కో సీజన్ కి ఎక్స్ ట్రీమ్ కి వెళ్తూ ఉంటుంది. ఆఖరి సీజన్ కి వచ్చే సరికి అసలు భూమి మీద ఎలాంటి మొక్క బతికే పరిస్థితి ఉండదు.

రెడ్ డస్ట్ అనే దాని వల్ల భూమి మీద ఉన్న అన్నీ మొక్కలు చనిపోతాయి. పంటలు పండవు. కానీ, ఒకే ఒక మొక్క మాత్రం బతుకుతుంది. ఆ మొక్క గింజల కోసం మళ్లీ ప్రపంచ దేశాల మధ్య యుద్ధం మొదలవుతుంది. దాడులు జరుగుతాయి. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉండే ఈ సిరీస్ ని మీరు స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. ఈ సిరీస్ పేరు ‘ది లాస్ట్ షిప్’. ఈ సిరీస్ 2014 నుంచి 2018 వరకు నడిచింది. మొత్తం ఐదు సీజన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ సీజన్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Show comments