OTT Suggestions- Best Action Movie Civil War: తెలుగు OTTని షేక్ చేస్తున్న వార్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు!

తెలుగు OTTని షేక్ చేస్తున్న వార్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు!

OTT Suggestions- Best Action Movie Civil War: ఓటీటీలోకి బెస్ట్ యాక్షన్ మూవీ వచ్చేసింది. వార్, అంతర్ యుద్ధం పాయింట్ మీద తెలుగు ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ 2లో కొనసాగుతోంది.

OTT Suggestions- Best Action Movie Civil War: ఓటీటీలోకి బెస్ట్ యాక్షన్ మూవీ వచ్చేసింది. వార్, అంతర్ యుద్ధం పాయింట్ మీద తెలుగు ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ 2లో కొనసాగుతోంది.

వార్ మూవీస్ అంటే ఒక ఫీల్ ఉంటుంది. అందులోనూ హాలీవుడ్ నుంచి వచ్చిన వార్ బేస్డ్ స్టోరీస్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి ఒక క్రేజీ వార్ స్టోరీ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వార్ స్టోరీ అలాంటి ఇలాంటిది కాదండోయ్.. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నిజానికి వార్ ఫీల్డ్ లో జరిగే నాటకీయ పరిణామాలు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ మెస్మరైజ్ చేస్తాయి. నిజానికి ఈ కథ మొత్తం అమెరికాలో జరిగేదే. అంటే సివిల్ వార్. అక్కడి వాళ్లు అదే ప్రభుత్వంపై తిరగబడతారు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలోనే వర్గాలు ఏర్పడతాయి. సొంత దేశంపై సొంత ప్రజలే పోరాటం చేస్తారు. ఇలాంటి పాయింట్స్ తో అద్భుతంగా కథ సాగుతుంది.

అమెరికా అంటే పెద్దన్న అనే బిరుదు ఉంది అని అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా కూడా ఎంతో పవర్ ఫుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి దగ్గర ఎంతో పవర్ ఫుల్ వెపన్స్ ఉంటాయి. అయితే అలాంటి దేశంలో తిరుగుబాటు స్టార్ట్ అయితే? రాష్ట్రాలు ఎదురు తిరగడం మొదలు పెడితే? వెస్ట్రన్ ఫోర్సెస్ అన్నీ రాజ్యాధికారం కోసం యుద్ధం ప్రకటిస్తే? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే ఈ కథ సాగుతూ ఉంటుంది. ఇందులో కావాల్సినన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అంతేకాకుండా.. ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

సాధారణంగానే వైట్ హౌస్ మీద అటాక్ బేస్ లైన్ మీద వచ్చిన సినిమాలు అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఈ మూవీ కూడా అలాంటి విజయాన్నే అందుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సివిల్ వార్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 2లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ, టేకింగ్, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో ఒక రిపోర్టర్ పాత్ర ఉంటుంది. ఆ క్యారెక్టర్ చుట్టూ, వారితో ఉన్న క్రూ చుట్టూ చాలా ఎమోషనల్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. మేము అమెరికన్స్ అంటే.. ఎలాంటి అమెరికన్స్ అని ఆర్మీ వాళ్లు అడిగే సీన్ షాక్ కు గురిచేస్తుంది. అంటే అమెరికన్ అయినా వాళ్లు వేరే అమెరికన్స్ అనే పరిస్థితి అది. సామాన్యులపై ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తారు. ఇలా సినిమా మొత్తం యాక్షన్, ఎమోషన్ మీదే సాగుతుంది. మరి.. మీరు ఈ సివిల్ వార్ సినిమా చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Show comments