Swetha
ఈ మధ్య కాలంలో OTT లో మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ చూసేవి ఏమైనా ఉన్నాయంటే అవి కొరియన్ వెబ్ సిరీస్ లే. మరి వాటిలో మీరు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సిరీస్ ను చూసారో లేదు ఓ సారి చెక్ చేసేయండి.
ఈ మధ్య కాలంలో OTT లో మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ చూసేవి ఏమైనా ఉన్నాయంటే అవి కొరియన్ వెబ్ సిరీస్ లే. మరి వాటిలో మీరు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సిరీస్ ను చూసారో లేదు ఓ సారి చెక్ చేసేయండి.
Swetha
ఈ వెబ్ సిరీస్ చూడడం స్టార్ట్ చేసారంటే ఇక టైం కూడా మర్చిపోయి కంప్లీట్ అయ్యేవరకు వదిలిపెట్టరు. అసలు ఈ సిరీస్ ఏంటి అనే విషయానికొస్తే.. ఆసూన్ అనే ఓ అమ్మాయి ఉంటుంది. ఆమె తన తల్లి మరణించిన తర్వాత తన తోడపుట్టిన వారి బాధ్యత తీసుకుంటుంది. మరోవైపు ఆమె తండ్రి మాత్రం మరో స్త్రీ తో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. దీనితో ఆసూన్ అతని మీద చాలా కోపం పెంచుకుంటుంది. ఆమె బాగా చదువుకుని జీవితంలో ఎదగాలని అనుకుంటుంది. కానీ పేదరికం కారణంగా ఆమె స్కూల్ కు వెళ్లలేకపోతుంది. మరో వైపు గ్వాన్-సిక్ అనే అతను ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు.. ఓ రోజు వారు ఎవరికీ తెలీకుండా ఆ ప్రదేశం నుంచి పారిపోతారు. వెళ్లిన చోట ఇబ్బందులు ఎదురవడంతో మళ్ళీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. అసలు కథ అప్పుడు మొదలవుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత వారికి ముగ్గురు పిల్లలు పుడతారు. ఓ రోజు పెద్ద తుఫాన్ రావడంతో తన చిన్న కొడుకు చనిపోతాడు. తన ఇద్దరి పిల్లలకు అలా కాకూడదని ఆసూన్ గట్టి నిరంతం తీసుకుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను కస్టపడి చదివిస్తారు. ఆ తర్వాత ఏమైంది ? తల్లి ఆశలను కూతురు నెరవేరుస్తుందా ? అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలని అనుకున్నాడు? ఇంత సింపుల్ గా ఉండే కథలో అసలు ట్విస్ట్ ఏమై ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ పేరు వెన్ లైఫ్ గివ్స్ యు టాంజరీన్స్. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ 1950ల నుండి 2025 వరకు నాలుగు దశాబ్దాలలో జరిగే జీవితాలను, ప్రేమను, కష్టాలను, విజయాలను అన్నిటిని చూపిస్తుంది. కాబట్టి ఓసారైనా ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.