Swetha
OTT Best Gaming Series : సరిగ్గా సెర్చ్ చేయాలే కానీ తెలుగులో కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటో ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Best Gaming Series : సరిగ్గా సెర్చ్ చేయాలే కానీ తెలుగులో కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటో ఈ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
వెబ్ సిరీస్ లను బాగా ఇంట్రెస్టింగ్ చూస్తున్న వారు.. ఈ వెబ్ సిరీస్ ను ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఓ మంచి తెలుగు వెబ్ సిరీస్ ను మిస్ అయినట్లే. సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ లోను ఎదో ఒక ట్విస్ట్ ఉంటుంది. దీనితో మేకర్స్ కూడా ఈ మధ్య ఎక్కువ వెబ్ సిరీస్ ల మీదే ఫోకస్ చూపిస్తున్నారు. పైగా వాటి కోసం సినిమా రేంజ్ లో భారీ బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నారు. ఇక సరిగ్గా సెర్చ్ చేయాలి కానీ తెలుగులో కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ వెబ్ సిరీస్ గురించే. మరి ఈ వెబ్ సిరీస్ ను మీరు చూశారో లేదో.. ఈ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.
ఈ వెబ్ సిరీస్ కథేంటంటే… గాయత్రీ , భార్గవ్ అనే ఇద్దరు ఒకటే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్లిద్దరూ కొలీగ్స్ ఏ కాకుండా.. ఫ్లాట్ మేట్స్ , క్లోజ్ ఫ్రెండ్స్ కూడా.. అయితే వారిద్దరూ డైరెక్ట్ గా మాట్లాడుకోవడం కంటే కూడా గేమింగ్ లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆన్ లైన్ గేమ్స్ అంటే అంత పిచ్చిగా ఉంటారు వారిద్దరూ. వారితో పాటు ఆనంద్ అనే వ్యక్తి కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు. బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అనే ఒక గేమ్ వీళ్ళ ముగ్గురు జీవితాలలో ఎలాంటి ప్రభావం చూపించింది.! అలాగే సరిగ్గా అదే సమయంలో.. ఆఫీసులో కొత్తగా రోషన్ అనే అతను రావడం వలన.. అప్పటివరకు క్లోజ్ గా ఉన్న గాయత్రి, భార్గవ్ ల మధ్య ఎలాంటి మనస్పర్థలు ఏర్పడతాయి! వారిద్దరూ అప్పటికే ప్రేమలో ఉన్నారా ! అసలు ఏంటి ఈ కథ ! తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ లో భార్గవి పాత్రలో నటించింది మరెవరో కాదు.. నిహారిక కొణిదెల. కాగా నిహారిక తో పాటు.. అక్షయ్ లగుసాని, హర్ష చెముడు (వైవా హర్ష), సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలాలో నటించారు.గేమ్స్ అంటే ఎంత పిచ్చిగా ఉంటారో .. పనులు మానుకుని మరీ గేమ్స్ ఎలా ఆడతారో .. ఛాలెంజెస్ గురించి ఇంకా చాల విషయాల గురించి దర్శకుడు ఈ సిరీస్ లో చూపించాడు. ఈ సిరీస్ పేరు “డెడ్ పిక్సెల్స్”. ఈ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇక ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.