iDreamPost
android-app
ios-app

OTTలో నేడు సినిమా జాతర.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌

  • Published May 31, 2024 | 8:41 AM Updated Updated May 31, 2024 | 8:41 AM

OTT Release: వీకెండ్‌ వచ్చేసింది. నేడు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లోకి ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఆ లిస్ట్‌ మీకోసం..

OTT Release: వీకెండ్‌ వచ్చేసింది. నేడు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లోకి ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఆ లిస్ట్‌ మీకోసం..

  • Published May 31, 2024 | 8:41 AMUpdated May 31, 2024 | 8:41 AM
OTTలో నేడు సినిమా జాతర.. ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌

వీకెండ్‌ వచ్చేసింది. చాలా మందికి ఈ రోజు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు రెస్ట్‌ మోడ్‌ అన్నమాట. దాంతో ఈ సమయాన్ని తమకు నచ్చినట్లుగా గడిపి.. చిల్లవుతారు. బయటకు వెళ్లడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. ఎండలు మండిపోతున్నాయి. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూద్దామంటే.. పెద్ద సినిమాలు ఏవి లేవు. దాంతో చాలా మంది.. ఇంట్లోనే ఉండి.. ఓటీటీలో రిలీజ్‌ అయ్యే మూవీస్‌ చూస్తూ చిల్లయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇక అలాంటి ఓటీటీ ప్రియుల కోసం ఇది పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఒక్కరోజే ఓటీటీలో 10 చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మూవీలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి అంటే..

ఎప్పటిలాగే ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని చిత్రాలు రెడీ అయిపోయాయి. వీటిల్లో విశ్వక్‌సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, కార్తికేయ భజేవాయువేగం బాక్సాఫీస్ సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అవుతున్నాయి. గతవారంలో అంతా చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ సారి మాత్రం కాస్తా విశ్వక్‌ సేన్‌ వంటి యంగ్‌ హీరోల చిత్రాలు ఒకేసారి థియేటర్‌లోకి రావడం కాస్త ఆసక్తి పెంచేస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఏది బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతుందో.. ఏది తేలిపోతుందో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.

థియేటర్లలో ముగ్గురు యంగ్‌ హీరోల సినిమాలు పోటీ పడుతుండగా.. ఓటీటీల్లోనూ భారీ ఎత్తున సినిమాల సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు త్వరలోనే ముగియనున్నాయి. దాంతో ఈ వేసవిని క్యాష్‌ చేసుకునేందుకు రిలీజైన సినిమాలను కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్‌లో మీరు ఓటీటీల్లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. వీటిల్లో మీకు నచ్చిన సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.

నెట్‌ఫ్లిక్స్

  • ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) – మే 31
  • రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) – మే 31
  • లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) – జూన్ 01

అమెజాన్ ప్రైమ్

  • బుజ్జి అండ్‌ భైరవ(యానిమేటేడ్ సిరీస్)- మే 31

హాట్‌స్టార్

  • జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31

జియో సినిమా

  • దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) – మే 31
  • లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) – మే 31
  • ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31
  • ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 01

జీ5

  • హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) – మే 31

సైనా ప్లే

  • పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) – మే 31

ఆహా

  • ప్రాజెక్ట్- జెడ్‌- మే 31

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş