iDreamPost
android-app
ios-app

OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఈ వారం OTTల్లోకి ఏకంగా 24 సినిమాలు..

  • Published Jul 01, 2024 | 10:32 AM Updated Updated Jul 01, 2024 | 10:32 AM

మరో వారం వచ్చేసింది.. ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అంటే..

మరో వారం వచ్చేసింది.. ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అంటే..

  • Published Jul 01, 2024 | 10:32 AMUpdated Jul 01, 2024 | 10:32 AM
OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఈ వారం OTTల్లోకి ఏకంగా 24 సినిమాలు..

ఇంకో వారం ప్రారంభం అయ్యింది. కొత్త వీక్‌ వచ్చిందంటే చాలు.. ఒకప్పుడైతే ఆ వారం థియేటర్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాల గురించి ఆలోచించేవారు. మరి ఇప్పుడో కాలం మారింది. ఇప్పుడు థియేటర్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాల కన్నా.. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాల సంఖ్య ఎక్కువగా ఉండటమే కాక.. వాటి మీద ఆసక్తి చూపించే వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే థియేటర్లలో కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. జూన్‌ 27న విడుదలైన ఈ చిత్రం.. దూసుకుపోతుంది. ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవి విడుదలకు లేవు. దాంతో ప్రేక్షకులు ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే చిత్రాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి.. ఏ ఓటీటీలో ఏ సినిమా విడుదల కాబోతుంది అంటే..

ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మూవీల మీద ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది. వాటిల్లో ‘మీర్జాపుర్’ సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఇవే కాక వీకెండ్‌ వరకు అనగా శుక్ర, శనివారాల నాటికి.. కొన్ని సినిమాలు ఉన్నట్లుండి ఓటీటీల్లోకి వచ్చి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వొచ్చు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు, సిరీస్‌లు రానుండగా.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏవి స్ట్రీమింగ్‌ కానున్నాయంటే..

జూలై 01-07 వరకు ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా

నెట్‌ఫ్లిక్స్

  • అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
  • స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
  • స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 02
  • బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 02
  • ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 03
  • బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 04
  • రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) – జూలై 04
  • డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) – జూలై 05
  • గోయో (స్పానిష్ చిత్రం) – జూలై 05

హాట్‌స్టార్

  • రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) – జూలై 03
  • ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) – జూలై 04

అమెజాన్ ప్రైమ్

  • బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 03
  • గరుడన్ (తమిళ చిత్రం) – జూలై 03
  • స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 04
  • మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 05

జియో సినిమా

  • ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) – జూలై 03
  • హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) – జూలై 05

ఆహా

  • హరా (తమిళ సినిమా) – జూలై 05

బుక్ మై షో

  • ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 03
  • ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) – జూలై 04
  • ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జూలై 05
  • విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 05

సోనీ లివ్

  • మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) – జూలై 05

మనోరమ మ్యాక్స్

  • మందాకిని (మలయాళ సినిమా) – జూలై 05

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş