iDreamPost
android-app
ios-app

OTT Release: ఫస్ట్‌ నైట్‌ రోజే భార్య లవ్‌ ఎఫైర్‌ గురించి భర్తకు తెలిస్తే.. OTTలోకి కామెడీ థ్రిల్లర్‌..

  • Published Jul 15, 2024 | 11:32 AM Updated Updated Jul 15, 2024 | 11:32 AM

OTT Release-Mandakini, Manorama Max: కామెడీ థ్రిల్లర్‌ సినిమా ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న సినిమాగా తెరకెక్కి.. భారీ విజయం సాధించిన ఈ సినిమా ఏది.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

OTT Release-Mandakini, Manorama Max: కామెడీ థ్రిల్లర్‌ సినిమా ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న సినిమాగా తెరకెక్కి.. భారీ విజయం సాధించిన ఈ సినిమా ఏది.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..

  • Published Jul 15, 2024 | 11:32 AMUpdated Jul 15, 2024 | 11:32 AM
OTT Release: ఫస్ట్‌ నైట్‌ రోజే భార్య లవ్‌ ఎఫైర్‌ గురించి భర్తకు తెలిస్తే.. OTTలోకి కామెడీ థ్రిల్లర్‌..

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఓటీటీల్లో రిలీజ్‌ అయ్యే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూసే కాలం వచ్చేసింది. ఈ క్రేజ్‌ను గుర్తించిన ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు.. కోట్లు ఖర్చు చేసి మరీ.. ప్రేక్షకుల కోసం కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను తీసుకువస్తున్నాయి. ప్రతి వారం ఓటీటీల్లోకి కొత్త కంటెంట్‌ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ కామెడీ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. భార్య లవ్‌ ఎఫైర్‌ గురించి.. అది కూడా ఫస్ట్‌ నైట్‌ రోజే భర్తకు తెలిస్తే.. అతడి పరిస్థితి ఏంటి.. ఆ తర్వాత భార్యను ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇదుగో ఇదే కథాంశంతో.. ఓ కామెడీ థ్రిల్లర్‌ తెరకెక్కింది. ఇప్పుడది ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆ వివరాలు.. మీకోసం.

ఈ ఏడాది మ‌ల‌యాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన కామెడీ థ్రిల్లర్‌ మందాకిని.  క‌మెడియ‌న్ అల్తాఫ్ స‌లీమ్ ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీతో హీరోగా మారాడు. వినోద్ లీలా ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ మూవీలో అనార్క‌లి మ‌రిక్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఎలాంటి అంచానాలు లేకుండా మే నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం.. అనూహ్య రీతిలో భారీ విజయాన్ని సాధించి.. క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. క‌థ‌, కామెడీతో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన వారి యాక్టింగ్‌ సూపర్‌ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కోటి రూపాయల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మందాకిని మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద ఐదు కోట్ల‌ రూపాయలకుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి.. బ్లాక్‌ బస్టర్‌ హిట్టుగా నిలిచింది.

ఆ ఓటీటీలోకి..

థియేట‌ర్ల‌లో నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ పండించిన మందాకిని మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చింది. మ‌నోర‌మా మాక్స్ ఓటీటీలో ప్రస్తుతం ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మ‌నోర‌మా మాక్స్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో లిస్ట్‌లో మందాకిని చిత్రం కూడా నిలిచింది. ఈ మ‌ల‌యాళం మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ రెండో ఓటీటీపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిసింది.

మందాకిని క‌థ ఇదే..

అరోమ‌ల్ (అల్తాప్ స‌లీమ్‌), అంబిలికి (అనార్క‌లి మ‌రిక్క‌ర్‌) పెద్ధ‌లు వివాహం జ‌రిపిస్తారు. ఫ‌స్ట్ నైట్ రోజు అరోమ‌ల్ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్‌లో మ‌ద్యం క‌లిపి అత‌డి చేత సీక్రెట్‌గా తాగించాల‌ని ప్లాన్ చేస్తారు. అనుకోకుండా మ‌ద్యం క‌లిపిన కూల్ డ్రింక్‌ను అతడి భార్య తాగుతుంది. ఆ మైకంలో.. తన లవ్‌ ఎఫైర్‌ గురించి, మాజీ ప్రియుడు చేసిన మోసం గురించి భర్తకు చెబుతుంది. దాంతో అరోమల్‌.. తన భార్యను మోసం చేసిన వ్యక్తిపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే మిగతా కథ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet