iDreamPost

OTTలోకి రీసెంట్‌ హిట్టు మూవీ.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌

  • Published Jul 04, 2024 | 1:32 PMUpdated Jul 04, 2024 | 1:32 PM

జ్యోతిక నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ఒకటి ఓటీటీల్లోకి వచ్చేస్తోంది. మరి కొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ వస్తుంది అంటే..

జ్యోతిక నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ఒకటి ఓటీటీల్లోకి వచ్చేస్తోంది. మరి కొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ వస్తుంది అంటే..

  • Published Jul 04, 2024 | 1:32 PMUpdated Jul 04, 2024 | 1:32 PM
OTTలోకి రీసెంట్‌ హిట్టు మూవీ.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్‌

ఇప్పుడు నడిచేది ఓటీటీల కాలం అని చెప్పవచ్చు. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఓటీటీల్లో కనిపించేందుకు సై అంటున్నారు. వీటికి క్రేజ్‌ పెరగడంతో.. ఆయా సంస్థలు భారీ మొత్తం ఖర్చు చేసి మరీ ప్రేక్షకుల కోసం కొత్త కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. ఇక థియేటర్‌లో రిలీజైన ప్రతి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలో దక్షిణాది నటి జ్యోతిక నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బాస్టర్‌ మూవీ ఒకటి ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో ఈ చిత్రం ఓటీటీల్లో విడుదల కానుంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ రిలీజ్‌ కాబోతుంది అంటే..

ఆంధ్రా ఆంత్రప్రెన్యూర్ శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా హిందీలో శ్రీకాంత్‌ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించాడు. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర హిట్టు టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో జ్యోతిక కీలక పాత్రలో నటించింది. తుషార్‌ హీరానందనీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం (జులై 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే మూవీ రాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మంచి రేటింగ్‌ దక్కింది.

పర్యావరణహిత వస్తువులు తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ స్థాపనతో శ్రీకాంత్ బొల్ల పాపులర్ అయ్యారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో జన్మించిన శ్రీకాంత్.. చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయారు. చూపు లేకపోవడంతో బాల్యం నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన.. తర్వాత ఎలా తన జీవితంలో అద్భుతాలను సృష్టించారో శ్రీకాంత్‌ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. దృష్టి లోపం ఉన్నప్పటికి.. సమస్యలను దాటుకుని.. సవాళ్లను ఎదుర్కొని.. తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్‌.

అంతేకాక అమెరికాలోని ఎంఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించారు. ఇక 2012లో శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించాక.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఫండింగ్ చేశారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం అని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి మన తెలుగు వాడు కావడం గర్వకారణం కాగా.. అతడి బయోపిక్‌ హిందీలో రావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి