iDreamPost
android-app
ios-app

మెడికల్ మాఫియా మోసాలు చూపించే వెబ్ సీరీస్ ! త్వరలో OTTలోకి!

  • Published Jun 22, 2024 | 7:47 PM Updated Updated Jun 22, 2024 | 7:47 PM

OTT New Releases- Riteish Deshmukh Web Series Pill: ఓటీటీలోకి రితేశ్ దేశ్ ముఖ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. తాను చేస్తున్న కొత్త వెబ్ సిరీస్ నుంచి ఒక మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

OTT New Releases- Riteish Deshmukh Web Series Pill: ఓటీటీలోకి రితేశ్ దేశ్ ముఖ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. తాను చేస్తున్న కొత్త వెబ్ సిరీస్ నుంచి ఒక మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

  • Published Jun 22, 2024 | 7:47 PMUpdated Jun 22, 2024 | 7:47 PM
మెడికల్ మాఫియా మోసాలు చూపించే వెబ్ సీరీస్ ! త్వరలో OTTలోకి!

జెనీలియా భర్త మూవీ అంటే కచ్చితంగా మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే రితేశ్ దేశ్ ముఖ్ కెరీర్ చూస్తేనే అర్థమవుతుంది. యాక్టింగ్ స్కోప్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే రితేశ్ ఆ కథకు ఓకే చెప్తాడు. అలాంటి రితేశ్ దేశ్ ముఖ్ ఈ మూవీలో చేస్తున్నాడు అంటే దాదాపుగా ఈ సిరీస్ హిట్టు కొట్టినట్లే. పైగా ఈ సిరీస్ మెడికల్ మాఫియా బేస్ మీద వస్తోంది. ఈ సిరీస్ కి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అసలు ఆ సిరీస్ ఏంటి? ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా మీకు నచ్చేస్తుంది.

మనం నిజ జీవితంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మందులు వాడతాం. వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి జలుబుకో.. తలనొప్పికో.. ఇంకేదేమైనా సమస్య ఉంటే మందులు కొనుక్కుంటాం. అయితే మీరు వాడే మందులు ఎంత వరకు మంచివి? మీరు నిజంగానే సరైన మందులే వాడుతున్నారా? వాటి వల్ల మీకు జబ్బు తగ్గుతుంది సరే? మీ ప్రాణం మిగులుతుందా? ఇలాంటి ప్రశ్నల తరహాలోనే ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. రితేశ్ దేశ్ ముఖ్ ఫస్ట్ లుక్ తో పాటుగా ఒక చిన్న డైలాగ్ ని కూడా రిలీజ్ చేశారు. రితేశ్ లుక్స్ కూడా కాస్త కొత్తగా ఉన్నాయి. కాస్త పెద్ద వయుసు ఉన్న వ్యక్తిలా చూపిస్తున్నారు.

సాధారణంగా మనం రియల్ లైఫ్ లో మెడికల్ మాఫియా మోసాల బారిన పడుతూనే ఉంటాం. కానీ, మనకు అది తెలియదు అంతే. అలాంటి ఒక నేపథ్యంలో వస్తున్నదే ఈ వెబ్ సిరీస్. ఈ మెడికల్ మాఫియా డ్రామా మొత్తం మందుల చుట్టూ తిరుగుతుంది. అంటే మీరు వాడే మెడిసిన్ చుట్టూ అనమాట. ఉదాహరణకు మన దేశంలో ఏ జబ్బు వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనే డేటా ఉంది. కానీ, తప్పుడు మందుల వల్ల.. మనం వాడే ఔషదాల వల్ల ఎంత మంది ప్రాణాలు పోయాయి అనే డేటా మాత్రం లేదు. అదే పాయింట్ ని మన హీరో పట్టుకున్నాడు. దేశంలో తప్పుడు మందుల వల్ల పోయిన ప్రాణాలు ఎన్ని అని ప్రశ్నిస్తున్నాడు. ఈ సిరీస్ పేరు ‘పిల్’. ఈ సిరీస్ లో రితేశ్ దేశ్ ముఖ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇవాళ అతని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే ఈ వెబ్ సిరీస్ అనేది జులై 12 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom