iDreamPost
android-app
ios-app

OTTలోకి చిరుత బ్యూటీ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి వణికిపోతారు!

  • Published May 28, 2024 | 3:21 PM Updated Updated May 28, 2024 | 3:21 PM

OTT New Releases- Neha Sharma New Web Series: నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడుకి పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

OTT New Releases- Neha Sharma New Web Series: నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడుకి పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • Published May 28, 2024 | 3:21 PMUpdated May 28, 2024 | 3:21 PM
OTTలోకి చిరుత బ్యూటీ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి వణికిపోతారు!

ఓటీటీలోకి ఒక వెబ్ సిరీస్ వస్తోంది అంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఓటీటీలోకి వచ్చే వెబ్ సిరీస్లు అన్నీ కూడా అదే రేంజ్ ఉత్కంఠ, సస్పెన్స్ థ్రిల్ ని అందిస్తున్నాయి. పైగా ఓటీటీ సంస్థలు స్వయంగా నిర్మిస్తే మాత్రం అది నెక్ట్స్ లెవల్లో ఉండటం ఖాయం. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చిరుత సినిమాలో నటించిన బ్యూటీ నేహా శర్మ నుంచి ఒక కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. దానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. నేహా శర్మ నుంచి ఈ రేంజ్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చేసింది.

నేహా శర్మ అంటే పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అటు సోషల్ మీడియాలో కూడా నేహా శర్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫొటోషూట్స్, జిమ్ వీడియోస్ అంటూ ఫ్యాన్స్ కు ఫిట్ నెస్ మీద అవగాహన పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు నేహాశర్మ ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకు సంబంధించి అధికారికంగా అప్ డేట్ రానే వచ్చింది. ఆ వెబ్ సిసీర్ పేరు 36 డేస్. ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ తోనే ఈ సిరీస్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ఎందుకంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. అందులోనూ చాలానే షేడ్స్, వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. నేహాశర్మ ఒక ఇంట్లో అద్దెకు వెళుతుంది.

నేహా శర్మ అద్దెకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితులు మొత్తం మారిపోతాయి. అక్కడ ఉన్న కుటుంబాల్లో ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకరు అంటే ఒకరికి పడకుండా పోతుంది. కొట్టుకుంటూ ఉంటారు. చంపుకునే దాకా కూడా వెళ్తారు. నేహాశర్మ అక్కడకు వెళ్లిన తర్వాత ఇలా జరుగుతోంది అనే విషయాన్న కొందరు గమనిస్తారు. అయితే అసలు నేహాశర్మ అక్కడకు ఎందుకు వెళ్లింది? అసలు ఆమెకు వాళ్లకు ఏంటి సంబంధం? వారిని చంపాలని ఆమె ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది? అసలు వారి మధ్య ఏం జరిగింది? అనే విషాలు తెలియాలి అంటే ఈ 36 డేస్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. అయితే ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే స్ట్రీమింగ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంక ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి.. నేహాశర్మ నటించిన ఈ 36 డేస్ వెబ్ సిరీస్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş