iDreamPost
android-app
ios-app

Netflixలోకి సూపర్ సిరీస్.. చావుతో చెలగాటం- దెయ్యాలతో శత్రుత్వం..!

Netflix Super Series: ఓటీటీ అనగానే అందరికీ మొదట నెట్ ఫ్లిక్స్ పేరు గుర్తొస్తుంది. ఈ నెట్ ప్లిక్స్ లోకి తాజాగా ఒక సూపర్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి రాబోతోంది. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కి వణుకు పుట్టాల్సిందే.

Netflix Super Series: ఓటీటీ అనగానే అందరికీ మొదట నెట్ ఫ్లిక్స్ పేరు గుర్తొస్తుంది. ఈ నెట్ ప్లిక్స్ లోకి తాజాగా ఒక సూపర్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి రాబోతోంది. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కి వణుకు పుట్టాల్సిందే.

Netflixలోకి సూపర్ సిరీస్.. చావుతో చెలగాటం- దెయ్యాలతో శత్రుత్వం..!

ఎన్ని ఓటీటీలు వచ్చినా కూడా ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ సంస్థ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. నెట్ ఫ్లిక్స్ ఇచ్చే కంటెంట్ ఎంతో కొత్తగా ఉంటుంది. అటు తెలుగులో కూడా మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొదటి నుంచి నెట్ ఫ్లిక్స్ కి ఫ్యాన్స్ లో యాక్షన్ చిత్రాలు, వెబ్ సిరీస్లను ఇష్టపడే వాళ్లే. అందుకే ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ అడ్వంచెర్స్ అంటే పడి చచ్చిపోతుంటారు. అలాంటి వారి కోసం నెట్ ఫ్లిక్స్ ఇండియా మరో అద్భుతమైన సిరీస్ ని తీసుకు రాబోతోంది. ప్రస్తుతం ఆ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు, థ్రిల్లర్ సిరీస్ లకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి వారికోసం ఇప్పుడు డెడ్ బాయ్ డిటెక్టివ్స్ అనే వెబ్ సరీస్ రాబోతోంది. ఈ సిరీస్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు, సిరీస్లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్ మాత్రం చూసుండరు. ఎందుకంటే ఇందులో ఉండే ఇద్దరు కుర్రాళ్లు చావుని జయించి.. కాదు కాదు చావుని చీట్ చేసి డిటెక్టివ్స్ గా కొనసాగుతూ ఉంటారు. అందుకే ఈ సిరీస్ కి డెట్ బాయ్ డిటెక్టివ్స్ అనే పేరు వచ్చింది.

ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ సిరీస్ సూపర్ న్యాచురల్ పవర్స్ నేపథ్యంలో సాగే సిరీస్. ఈ సిరీస్ ట్రైలర్ చూసిన తర్వాత కథ అయితే క్లియర్ గా అర్థమైపోతోంది. ఇద్దరు కుర్రాళ్లు చావుని చీట్ చేసి తప్పించుకుంటూ ఉంటారు. వారిని పట్టుకోవడానికి.. తిరిగి నరకానికి తీసుకెళ్లడానికి కొన్ని దెయ్యాలు, ఆత్మలు వెతుకుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుంటూనే.. వారి గోల్స్ కోసం కృషి చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు కుర్రాళ్లకు కొన్ని మంత్రి శక్తులు ఉన్న యువతి కూడా తోడవుతుంది. వీళ్లంతా కలిసి నరకానికి వెళ్లకుండా ఎలా తప్పించుకున్నారు? చావుని ఎలా చీట్ చేయగలిగారు.

అసలు ఈ ఇద్దరు కుర్రాళ్లు దేనికోసం డిటెక్టివ్స్ గా చేస్తున్నారు? వీళ్లకు ఎలాంటి కేసులు వస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా సిరీస్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుంది అని అర్థమైపోతోంది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో వస్తోందని క్లారిటీ ఉంది. కానీ, తెలుగులో ఉంటుందో లేదో చెప్పడం కష్టం. మరి.. ఈ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş