OTT Suggestions- Best Sci-Fi Movie : OTT లో జుమాన్జి లాంటి అడ్వెంచర్ మూవీ.. గేమ్ ఆడుతూ స్పేస్ లోకి వెళ్ళిపోతారు

OTT లో జుమాన్జి లాంటి అడ్వెంచర్ మూవీ.. గేమ్ ఆడుతూ స్పేస్ లోకి వెళ్ళిపోతారు

OTT Best Sci-Fi Movie : ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇద్దరూ బ్రదర్స్ అనుకోకుండా ఓ గేమ్ ను స్టార్ట్ చేస్తారు. కానీ ఆ గేమ్ తో వాళ్ళ ఇల్లు స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Sci-Fi Movie : ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇద్దరూ బ్రదర్స్ అనుకోకుండా ఓ గేమ్ ను స్టార్ట్ చేస్తారు. కానీ ఆ గేమ్ తో వాళ్ళ ఇల్లు స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

కొన్ని సైన్స్ ఫిక్షన్ డ్రామాస్ చూడడానికి అసలు అర్ధం కావు. కొన్ని అనుకోని తెలియని పనులను చేయడం వలన.. ఉన్న ప్రపంచమే మారిపోతుంది. ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సినిమా మాత్రం చూసి ఉండరు. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఇదో వెరైటీ మూవీ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇద్దరు బ్రదర్స్ కలిసి ఓ తెలియని గేమ్ ను స్టార్ట్ చేస్తారు. దీనితో వాళ్ళ ఇల్లు ఉన్నట్లుండి స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ సినిమా ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా ? అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. డ్యానీ అనే ఓ చిన్న పిల్లాడు.. తన అన్న వాల్టర్ , నాన్న గేమ్ ఆడడం చూస్తూ ఉంటాడు. అయితే డ్యానీ స్పోర్ట్స్ లో కాస్త వీక్ గా ఉంటాడు. వాల్టర్ ఏమో గేమ్స్ విషయంలో ఫాస్ట్ గా ఉంటాడు. అది చూసి డ్యానీ ఫీల్ అవుతాడు.. నాకంటే వాల్టర్ ఎక్కువగా పెర్ఫర్మ్ చేస్తున్నాడని తనకు ఏమి రాదనీ భాదపడతాడు. దీనితో వాళ్ళ నాన్న అతనికి సర్ది చెప్తూ.. వాల్టర్ గేమ్స్ ఆడడంలో స్ట్రాంగ్ అయితే నువ్వు గేమ్స్ ను కనిపెట్టడంలో స్ట్రాంగ్ అని చెప్పి.. అతను ఆఫీస్ కు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. దీనితో డ్యానీ వెళ్ళి ఆ ఇంట్లో ఉండే చిన్న ఎలివేటర్ లో దాక్కుంటాడు. దీనితో వెంటనే వాల్టర్ దానిని బేస్మెంట్ లోకి దించుతాడు. అక్కడ అంతా కూడా చీకటిగా ఉంటుంది. డ్యానీ అందులో దెయ్యాలు ఉన్నాయనుకుని భయపడుతూ ఉంటాడు. అయితే డ్యానికి అక్కడ జతురా అనే ఓ గేమ్ బోర్డు కనిపిస్తుంది. దానిని తీసుకుని పైకి వచ్చేస్తాడు.

అక్కడికి వచ్చి వాల్టర్ ను ఆ గేమ్ ఆడమని అడుగుతాడు. ఇలాంటివన్నీ చిన్న పిల్లలే ఆడతారని తానూ ఈ గేమ్ ఆడనని వాల్టర్ చెప్తాడు. దీనితో డ్యానీ ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ బోర్డు లో నుంచి ఓ కార్డు బయటకు తీయగానే.. వాళ్ళ ఇల్లు స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. దీనిని అదే ఇంట్లో ఉండే వాళ్ళ అక్కకు ఈ విషయాలన్నీ చెప్తే ఆమె నమ్మదు. దీనితో మళ్ళీ ఆ గేమ్ ను ఆడతాడు డ్యానీ అప్పుడు ఇంకొక కార్డు బయటకు వస్తుంది. ఆ కార్డులో ఎవరో ఒకరు ఫ్రీజ్ అయిపోతారని వస్తుంది. అదే నిజమవుతుంది. దీనితో వెంటనే ఆ ఇద్దరు బ్రదర్స్ కలిసి జతురా గేమ్ రూల్స్ ను చదువుతారు. ఆ గేమ్ స్టార్ట్ చేస్తే ఆపకూడదని.. దానిని ఇద్దరు ఆడాలని అలా కొన్ని రూల్స్ ఉంటాయి. దీనితో ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ గేమ్ ను ఆడతారు. అందులోను నుంచి ఒక్కో కార్డు వస్తూ ఉంటుంది. అదే నిజమవుతుంది. అసలు ఈ జతురా అనే గేమ్ ఏంటి ? వీళ్ళు ఆ గేమ్ ఆడి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు ? తిరిగి వాళ్ళ ఇళ్లు భూమి మీదకు వస్తుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే “జతురా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments