iDreamPost
android-app
ios-app

11 వందలేళ్లు బతికుండే రాణి.. OTTలో బెస్ట్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్!

  • Published Aug 06, 2024 | 7:24 PM Updated Updated Aug 06, 2024 | 7:24 PM

OTT Best Action Fantasy Thriller: కొన్ని సినిమాలు చివరి వరకు చూసిన తర్వాత కచ్చితంగా ఒకరకమైన శాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది కదా సినిమా అంటే అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Action Fantasy Thriller: కొన్ని సినిమాలు చివరి వరకు చూసిన తర్వాత కచ్చితంగా ఒకరకమైన శాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది కదా సినిమా అంటే అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 06, 2024 | 7:24 PMUpdated Aug 06, 2024 | 7:24 PM
11 వందలేళ్లు బతికుండే రాణి.. OTTలో బెస్ట్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్!

ప్రతి వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎలాగూ చూస్తూనే ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆల్రెడీ ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు చివరి వరకు చూసిన తర్వాత కచ్చితంగా ఒకరకమైన శాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది కదా సినిమా అంటే అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఈ మూవీ చూశాక ఆశ్చర్య పోకుండా ఉండలేరు. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే కనుక ఓ మంచి యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విల్, జాక్ అనే ఇద్దరు బ్రదర్స్.. ఒక ఊరిలో ఉండే జనాలకు హెల్ప్ చేయడానికి వెళ్తారు. ఆ ఊరిలో ఒక మంత్రగత్తె ఆత్మ అక్కడి జనాలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనితో ఆ ఊరి నుంచి ఆత్మను తరిమేసి.. అక్కడ ప్రజలను కాపాడడానికి ఈ అన్నదమ్ములిద్దరూ బయల్దేరతారు. ఆ అన్నదమ్ములు ఒక లిస్ట్ తయారు చేసి.. ఇంత డబ్బు ఇస్తేనే ఆ ఆత్మను వెళ్ళగొడతాం అని చెప్తారు. కట్ చేస్తే ఆ అన్నదమ్ములిద్దరూ ఈ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ మంత్రగత్తె ఆత్మ వారిపై ఎటాక్ చేస్తుంది. వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా అది ప్రేరేపిస్తుంది. ఇలా ఫైట్ చేసుకునే క్రమంలో ఎలాగూ ఒకలా ఆ ఆత్మను చంపేస్తారు. దీనితో వారికి అక్కడ పని అయిపోయిందని.. వేరే ఊరికి వెళ్లాలని.. త్వరగా డబ్బు ఇవ్వాలని అడుగుతారు. ఆ ఊరి వాళ్ళు కూడా అలాగే డబ్బు ఇచ్చి పారిపోతారు.

అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరికీ అసలు వారు చేసే పని కరెక్ట్ ఏ నా కాదా అనే డౌట్ వస్తుంది. అయితే నిజానికి వారికి ఏ మంత్రాలూ రావు. అది కూడా ఒక డమ్మీ ఆత్మ. వీరే దానిని సృష్టించి.. వెళ్లగొట్టినట్లు ఓ రకమైన బిజినెస్ ను చేస్తారు. ఇదే క్రమంగా వారికి అలవాటుగా మారుతుంది. కట్ చేస్తే ఓ ఫ్రెంచ్ మేయర్ బాగా కొట్టి వారిని రాజు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఒక ఊరిలో వీరు మోసం చేసేవాళ్ళని తెలిసిపోతుంది. దీనితో రాజు వారికి మరణ శిక్ష విధిస్తాడు. కానీ వారు చివరిగా ఒక అవకాశం ఇవ్వమని అడుగగా.. ఆ రాజు తానూ చెప్పిన పని చేస్తే వారిని విడిచి పెడతానని చెప్తాడు. అదేంటంటే తన రాజ్యాంలో ఉన్న కొంతమంది యువతులు ఒక అడవికి వెళ్ళినపుడు ఒక్కొక్కరిగా మిస్ అవుతూ ఉంటారు. అసలు ఆ అడవిలో ఏం ఉంది అనేది వీరు తెలుసుకోవాలని ఆదేశిస్తాడు. తీరా అక్కడికి వెళ్తే అక్కడ వారికి భయంకరమైన అనుభవాలు ఎదురౌతాయి. పైగా ఆ అడవికి ఓ కథ కూడా ఉందని చెప్తారు. అసలు ఆ అడవికి ఉంటే కథ ఏంటి ? ఎందుకు అడవిలోకి వెళ్లిన యువతులు మాయమైపోతున్నారు ? ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ మిస్టరీని ఛేదించారా లేదా? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “ది బ్రదర్స్ గ్రిమ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.