iDreamPost
android-app
ios-app

ఇలాంటి భర్త వస్తే ప్రతి అమ్మాయి జీవితం ఆనందమే.. OTTలో బెస్ట్ మూవీ!

  • Published Jun 10, 2024 | 6:35 PM Updated Updated Jun 10, 2024 | 6:35 PM

OTT Movie Suggestions- Super Family Drama: మీరు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూసి చాలా రోజులు అవుతోందా? అయితే ఈ మూవీని అస్సలు మిస్ కావొద్దు. ఇంటిల్లిపాది కలిసి కూర్చుని చూడదగిన చిత్రం ఇది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్లు అస్సలు మిస్ కాకూడదు.

OTT Movie Suggestions- Super Family Drama: మీరు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూసి చాలా రోజులు అవుతోందా? అయితే ఈ మూవీని అస్సలు మిస్ కావొద్దు. ఇంటిల్లిపాది కలిసి కూర్చుని చూడదగిన చిత్రం ఇది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్లు అస్సలు మిస్ కాకూడదు.

  • Published Jun 10, 2024 | 6:35 PMUpdated Jun 10, 2024 | 6:35 PM
ఇలాంటి భర్త వస్తే ప్రతి అమ్మాయి జీవితం ఆనందమే.. OTTలో బెస్ట్ మూవీ!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. అసలు పెళ్లి అయిన తర్వాత జీవితం విలువ తెలుస్తుంది అంటారు. అలాగే మీరు ఎంచుకునే పార్టనర్ ని బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనేది కూడా నూటికి నూటయాభై శాతం సత్యం. ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక మంచి భర్తని ఎంచుకోకపోతే జీవితం దాదాపుగా నరకం అయిపోయినట్లే. అలాంటి అమ్మాయిలకు ఎలాంటి భర్త రావాలో ఈ మూవీ చూస్తే మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒక భర్త ఎలా ఉండాలో ఈ మూవీలో ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి భర్త వస్తే ఆ అమ్మాయి జీవితం తప్పకుండా సంతోషంగా మారుతుంది.

ఈ సినిమా ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అవుతుంది. ఎందుకంటే ఇందులో ఒక భర్త ఎలా ఉండాలి? ఎలాంటి భర్త వస్తే అమ్మాయి జీవితం బాగుంటుంది? అసలు అమ్మాయిలు పెళ్లైన తర్వాత ఎలా ఉండాలి? అనే విషయాలను స్పష్టంగా చూపించారు. ఈ మూవీలో హీరోయిన్ ఒక రకమైన ఫోబియా ఉంటుంది. తను ఒంటరిగా ఉండలేదు. అలాంటి అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. సాధారణంగా ఎంతో ధైర్యంగా ఉన్న అమ్మాయిలే ఈ సమాజంలో చాలా సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. అలాంటిది ఒక ఫోబియా ఉన్న అమ్మాయి ఎలా ఉండగలుగుతుంది? అలాంటి అమ్మాయికి కుటుంబం, భర్తే సపోర్ట్ గా ఉండాలి. ఈ మూవీలో భర్త కూడా అదే చేస్తాడు.

Jaanaki Jane

ఆ అమ్మాయికి తల్లి మాత్రమే ఉంటుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చిన భర్త ఆమెను గుండెల్లో పెట్టకుని చూసుకుంటాడు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక చిన్న కుదుపు ఏర్పడుతుంది. అది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఆ అమ్మాయి మీద ఒక పెద్ద నీలాపనింద పడుతుంది. అలాంటి సమయంలో కూడా ఆ భర్త ఆమె చేయి విడువలేదు. ఆమెకు వెన్నంటే నిలుస్తాడు. ఆమెను ఎంతలా మార్చేస్తాడు అంటే.. చిన్న బొద్దింకని చూసినా భయపడే ఆ అమ్మాయి.. ఒక పెద్ద రాజకీయ పార్టీనే ఎదిరించే నిలబడేలా చేస్తాడు. తనపై పడిన ఒక నిందను ఆమె చేతుల్తో ఆమె చెరిపేసేలా చేస్తాడు.

ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీని మీరు ఇన్ని రోజులు మిస్ అయితే మాత్రం కాస్త బాధ పడాల్సిందే. అంతేకాకుండా ఈ మూవీ ఒక భర్త ఎలా ఉండాలో కూడా చెప్తుంది. అలాగే సమాజంలో ఎలా ఉంటే నెగ్గుగు రాగలరు అనే విషయం కూడా స్పష్టంగా ఉంటుంది. మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూడదగిన చిత్రం ఇది. ఈ మూవీ మలయాళంలో విడుదలైంది. అయితే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ‘జానకీ జానే’. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş