OTT Suggestions-Recent Horror Movie In Telugu: పడుకుంటే దెయ్యం పట్టేస్తుంది.. OTT లో ఇప్పటివరకు చూడని హర్రర్ మూవీ!

పడుకుంటే దెయ్యం పట్టేస్తుంది.. OTT లో ఇప్పటివరకు చూడని హర్రర్ మూవీ!

OTT Recent Horror Movie In Telugu: హర్రర్ మూవీ లవర్స్ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మేకర్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే హర్రర్ మూవీస్ లోనే ఇప్పటివరకు చూడని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.

OTT Recent Horror Movie In Telugu: హర్రర్ మూవీ లవర్స్ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మేకర్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అయితే హర్రర్ మూవీస్ లోనే ఇప్పటివరకు చూడని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.

హర్రర్ మూవీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. దీనితో తెలుగులో కూడా మేకర్స్ మంచి మంచి కాన్సెప్ట్స్ తో హర్రర్ మూవీస్ ను రూపొందిస్తున్నారు. ఇక కొరియన్ లో అయితే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ చాలానే ఉన్నారు. ఇక ఎలాగూ కొరియన్ సినిమాలకు , సిరీస్ లకు కూడా మూవీ లవర్స్ మదిలో ఓ ప్రత్యేకమైన స్థానమే ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ గురించే.. పైగా తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక మూవీ రన్ టైమ్ కూడా 1గంట 30 నిముషాలు మాత్రమే కాబట్టి.. ఈ వీకెండ్ మంచి హర్రర్ మూవీని చూడాలని అనుకునే వారి కోసం ఈ మూవీ. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. భార్య భర్తలు ఉంటారు.. వాళ్ళ లైఫ్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ కూడా. అంతా బాగానే ఉంటుంది. కానీ ఆమె భర్తకు మాత్రం నిద్రలో నడిచే ఉంటుంది. అతను ఒక్కసారి పడుకుంటే మాత్రం అతను ఏం చేస్తాడో ఎప్పుడు నడుస్తాడో.. ఎలా బెహేవ్ చేస్తాడో అతనికి కూడా తెలియదు. చాలా వింతగా , భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పగలంతా బాగానే ఉండే అతను.. నైట్ అయ్యేసరికి ఎందుకు అలా బెహేవ్ చేస్తున్నాడు ? రాత్రి పూట అతనిని ఏదైనా ఆత్మ ఆవహిస్తుందా ? అతని వైఫ్ అతనిని కాపాడుకోవడం కోసం ఎలాంటి సాహసాలు చేసింది ? ఈ క్రమంలో ఆమె ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి అనేది తెరపై చూడాల్సిన కథ. ఈ సినిమా పేరు “స్లీప్”. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

ఇప్పటివరకు హర్రర్ కాన్సెప్ట్ బేస్డ్ లో చాలానే సినిమాలు చూసి ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం అన్ని సినిమాలల కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. హర్రర్ మూవీస్ అంటే దెయ్యాలు మాత్రమే ఉండాలని లేకుండా.. దెయ్యాలను చూపించకుండా కూడా స్లీప్ వాకింగ్ అనే డిసార్డర్ తో కూడా ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఏపీరియెన్స్ ఇవ్వొచ్చని.. ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. అలాగే తన ఫ్యామిలీకి ప్రాబ్లమ్ వస్తే ఓ మహిళ ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందనే ప్లాట్ కూడా ఈ మూవీలో చూపించారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే నెక్ట్ లెవెల్ అసలు ఊహించలేరు. వీకెండ్ కు ఓ మంచి హర్రర్ థ్రిల్లర్ ను ఎక్స్పీరియెన్స్ చేయాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments