iDreamPost
android-app
ios-app

OTT లో భార్య భర్తలు కచ్చితంగా చూడాల్సిన మూవీ.. వారిద్దరికీ పెళ్లవుతుంది కానీ!

  • Published Aug 03, 2024 | 8:05 AM Updated Updated Aug 03, 2024 | 8:05 AM

OTT Best Emotional Drama In Telugu: ఇప్పుడు రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేయని యూత్ ఎవరు లేరు. అయితే అవి ఎంత కాలం నిలబడతాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మరి పెళ్ళి అయ్యాకా భార్య భర్తలు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే.. వారిద్దరి పరిస్థితి ఏంటి ? అది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

OTT Best Emotional Drama In Telugu: ఇప్పుడు రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేయని యూత్ ఎవరు లేరు. అయితే అవి ఎంత కాలం నిలబడతాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మరి పెళ్ళి అయ్యాకా భార్య భర్తలు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే.. వారిద్దరి పరిస్థితి ఏంటి ? అది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

  • Published Aug 03, 2024 | 8:05 AMUpdated Aug 03, 2024 | 8:05 AM
OTT లో భార్య భర్తలు కచ్చితంగా చూడాల్సిన  మూవీ.. వారిద్దరికీ పెళ్లవుతుంది కానీ!

భార్య భర్తల కాన్సెప్ట్స్ మీద ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. ప్రతి కథ కూడా ఓ మంచి మెసేజ్ తో ఎండ్ అవుతుంది. ఇప్పుడున్న జెనరేషన్ వారు కొన్ని సినిమాలను చూస్తే పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది.. ఇక మరికొన్ని సినిమాలు చూస్తే జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని ఫిక్స్ అవుతూ ఉంటారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం వారిది అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ఇప్పడు చెప్పుకోయే మూవీ ఇలాంటిదే. ఇప్పుడు లవర్స్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటేనే తర్వాత ఏమౌతుందో గ్యారెంటీ లేదులే. మరి పెళ్ళి అయ్యాకా భార్య భర్తలు లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే.. వారిద్దరి పరిస్థితి ఏంటి ? అనే కాన్సెప్ట్ ఏ ఈ మూవీ. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

అసలు ఈ స్టోరీ కథ విషయానికొస్తే.. మీనాక్షి అనే అమ్మాయికి రజినీకాంత్ సినిమాలంటే చాలా ఇష్టం. రజినీకాంత్ సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. అయితే మీనాక్షి వాళ్ళ అమ్మ తనకు పెళ్ళి చూపులు అరేంజ్ చేస్తుంది. కానీ వారిద్దరూ పెళ్ళి కొడుకు పేరు మర్చిపోతారు. వెంటనే మీనాక్షి వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్తుంది. అక్కడ మీనాక్షి వాళ్ళ నాన్న , తాతయ్య పూజ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ సుందరేశ్వర్ అనే అతని ఫ్యామిలీ ని చూపిస్తారు. అతను బీటెక్ చదివినా కానీ జాబ్ మాత్రం రాదు. అతని నాన్న కు ఓ బట్టల షాప్ ఉంటుంది. కానీ అందులో పని చేయడం అతనికి ఇష్టంలేదు.. ఈలోపే ఇంట్లో వాళ్ళు అతనికి పెళ్ళి చూపులు అరేంజ్ చేస్తారు. ఈ క్రమంలోనే అతను పెళ్లి చూపులకు మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ అంత మంచిగా జరుగుతున్న క్రమంలో సడెన్ గా వారికి ఓ విషయం తెలుస్తుంది. అదేంటంటే సుందరేశ్వర్ ఫ్యామిలీ రాంగ్ అడ్రస్ కు వచ్చారనే విషయం తెలుస్తుంది.

కానీ పెళ్ళిచూపులలోనే వీరిద్దరూ ప్రేమలో పడడంతో.. మీనాక్షి, సుందరేశ్వర్ కే వివాహం జరుగుతుంది. ఇక పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇంకాస్త క్లోజ్ అయిపోతూ ఉంటారు. అయితే సరిగ్గా వారిద్దరూ దగ్గరౌతు ఉండగా సుందరేశ్వర్ కు ఓ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత రోజు అతనికి ఇంటర్వ్యూ ఉందని తెలుస్తుంది. ఇక అప్పటినుంచి అతను ఇంటర్వూస్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడు. కొద్దిరోజులకే అతనికి బెంగళూరులో జాబ్ వస్తుంది. అయితే ఆ కంపెనీలో బ్యాచలర్స్ కు మాత్రమే ఉద్యోగం ఇస్తుందని చెప్పడంలో.. సుందర్ అప్పటినుంచి బ్యాచలర్ గా నటిస్తాడు. దీనితో మీనాక్షిని వదిలేసి అతను బెంగళూరు వెళ్లాల్సి వెళ్తాడు. ఈ క్రమంలో అత్తారింట్లో అనుకోకుండా ఓ అపార్దానికి లోనవుతుంది. దీని వలన సుందర్ తో కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. అసలు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వారిద్దరికీ ఇప్పుడు ఈ గొడవలు యాడ్ అవ్వడంతో ఇంకాస్త దూరం పెరుగుతుంది. చివరికి వీరిద్దరూ కలుస్తారా లేదా ! సుందర్ జాబ్ ఏమౌతుంది ? వీరిద్దరి దాంపత్య జీవితం ఎలా సాగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “మీనాక్షి సుందరేశ్వర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కాబట్టి వెంటనే ఈ సినిమాను చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss