Swetha
హర్రర్ సినిమాలంటే ఇష్టం అయితే కనుక ఈ సినిమాను అసలు మిస్ అయ్యి ఉండరు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక ఓ మంచి హర్రర్ సస్పెన్స్ ని మిస్ అయినట్లే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
హర్రర్ సినిమాలంటే ఇష్టం అయితే కనుక ఈ సినిమాను అసలు మిస్ అయ్యి ఉండరు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక ఓ మంచి హర్రర్ సస్పెన్స్ ని మిస్ అయినట్లే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
హర్రర్ సినిమాలకు ఇప్పుడు బాగా క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మేకర్స్ కూడా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇలాంటి జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇక దాదాపు హర్రర్ జోనర్ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.. హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటే కనుక ఈ సినిమాను అసలు మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ అయితే కనుక ఓ మంచి హారర్ సస్పెన్స్ ని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా కథేంటంటే.. బషీర్ అనే ఓ రచయిత.. కథ రాయడం కోసం ఓ పల్లెటూరులో సముద్రం ఒడ్డుకు వస్తాడు. ఈ క్రమంలో ఊరి చివరన ఉండే భార్గవి నిలయం అనే ఓ పాడుపడిన భవంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి అనే అమ్మాయి ఆత్మ ఉందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆ ఆత్మ నిజంగానే కనిపిస్తుంది కూడా.. ఆ ఇంట్లో ఎవరు అడుగుపెట్టిన కూడా భార్గవి ఆత్మ అసలు ఊరుకోదు. కానీ బషీర్ ను మాత్రం ఆ ఆత్మ ఏమి చేయదు. భార్గవి గురించి ఊరి ప్రజలందరూ రకరకాలుగా చెప్పుకుంటారు. దీనితో ఆమె చావు వెనుక ఉన్న కారణాలనే కథగా రాయాలని అనుకుంటూ ఉంటాడు బషీర్. ఈ క్రమంలో అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ! అసలు భార్గవి ఎలా చనిపోయింది ! భార్గవి బషీర్ ను మాత్రమే ఎందుకు ఏమి అనకుండా ఊరుకుంటుంది ! అసలు ఆమె వెనుక దాగి ఉన్న కథేంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఓ అమ్మాయి అనుకోకుండా చనిపోవడం, తన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఓ పాడుపడిన బిల్డింగ్ లో ఆత్మగా తిరగడం. దాదాపు హర్రర్ కథలన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఈ సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే కానీ ఇది కాస్త డిఫ్ఫరెంట్ కథ. ఇది 1964 లో మలయాళంలో హర్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచినా.. భార్గవి నిలయం సినిమాకు రీమేక్ గా తీశారు. ఈ సినిమా పేరు ” నీల వెలిచమ్”. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట ఈ సినిమా చూస్తున్నపుడు రొటీన్ గా అనిపించినా కూడా క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.