iDreamPost
android-app
ios-app

16వేల కోసం 5 పెళ్లిళ్లు! OTT లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

  • Published Jul 23, 2024 | 11:30 PM Updated Updated Jul 23, 2024 | 11:30 PM

Recent Mayalam Series In OTT: వెబ్ సిరీస్ లను ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సిరీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

Recent Mayalam Series In OTT: వెబ్ సిరీస్ లను ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సిరీస్ ను మీరు కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jul 23, 2024 | 11:30 PMUpdated Jul 23, 2024 | 11:30 PM
16వేల కోసం 5 పెళ్లిళ్లు! OTT లో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

మలయాళ కంటెంట్ ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇక ఈ మధ్య కాలంలో వరుసగా ఓటీటీ లో మలయాళ మూవీస్, సిరీస్ లు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వాటికి లభించే ఆదరణ కూడా అలాగే ఉంది. ఇక ఇప్పుడు ప్రత్యేకించి వెబ్ సిరీస్ లకు లభిస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రీసెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా ఓ మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను తెగ ఇంప్రెస్స్ చేసేస్తోంది. ఈ సిరీస్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా.. ప్రేక్షకులలో ఓ రకమైన ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. దీనితో ఇప్పుడు ఈ సిరీస్ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ను కానీ మీరు మిస్ చేసారా ఓ లుక్ వేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. నాగేంద్రన్ అనే ఓ పని పాట లేని వ్యక్తి ఉంటాడు. అతని తల్లికి వయసైపోతున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా తన తల్లి సంపాదనతోనే జీవితం సాగిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని ఫ్రెండ్ ఒక అతను కువైట్ నుంచి తిరిగి వస్తాడు. అతనిని చూసి నాగేంద్రన్ కూడా ఎలాగైనా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటాడు. అందుకోసం అతను కూడా కువైట్ వెళ్లాలని అనుకుంటాడు. కానీ అక్కడకు వెళ్లాలంటే రూ.17 వేలు అవసరం అవుతుంది. అయితే డబ్బు కోసం తన మామ కూతురును పెళ్లి చేసుకుంటాడు. కానీ అతను మామ డబ్బు ఇవ్వకపోడంతో.. తన ఫ్రెండ్ తో కలిసి అక్కడినుంచి పారిపోతాడు. కట్ చేస్తే అక్కడ వేరే ఊరిలో ఓ పోలీస్ ఆఫీసర్ తన చెల్లికి పెళ్లి కావడం లేదని బాధపడతాడు. దీనితో నాగేంద్రన్ అక్కడ.. జోసెఫ్ అని పేరు మార్చుకుని.. ఆ పోలీస్ ఆఫీసర్ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ పోలీస్ కు ఓ కట్టు కథ చెప్పి అతని దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి కూడా పారిపోతాడు.

అక్కడి నుంచి మరొక ఊరికి పారిపోయిన నాగేంద్రన్.. అక్కడ తన పేరును ఓ ముస్లింలా అలీ జోసెఫ్ అని మార్చుకుని.. లైలా సుల్తానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పేదరికంలో ఉన్న ముస్లిం అబ్బాయిలకు , అమ్మాయిలకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీనితో ఈ పెళ్లి తర్వాత వారికి వచ్చిన డబ్బుతో.. మళ్ళీ అక్కడినుంచి పారిపోతాడు. అయితే ఇక్కడ ఈ పెళ్లి ఫోటో.. ఆ పోలీస్ ఆఫీసర్ కంట పడుతుంది. దీనితో అతని కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ అప్పటికే నాగేంద్రన్ ఓ బ్రాహ్మణ అమ్మాయితో పెళ్ళి చేసుకుంటాడు. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి.. ఆమెకు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పారిపోతాడు.

ఇక మరో ఊరికి వెళ్లి అక్కడ ఓ వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. అక్కడ వారిచ్చిన డబ్బును తీసుకుని మరో ఊరికి వెళ్ళిపోయి..మోరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అప్పటినుంచి అతని జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఆ పోలీస్ ఆఫీసర్ నాగేంద్రన్ ను పట్టుకుంటాడా లేదా ? అంతమందిని పెళ్లి చేసుకున్న నాగేంద్రన్ చివరికి ఎవరికీ న్యాయం చేస్తాడు ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది తెలియాలంటే రీసెంట్ గా వచ్చిన “నాగేంద్రన్స్ హనీమూన్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. పెళ్ళైన మొదటి రోజే భార్య ఇంట్లో నుంచి పారిపోతే.. OTT లో ఈ మూవీ మరో లెవెల్

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş