iDreamPost
android-app
ios-app

పెళ్ళైన మొదటి రోజే భార్య ఇంట్లో నుంచి పారిపోతే.. OTT లో ఈ మూవీ మరో లెవెల్

  • Published Jul 22, 2024 | 10:21 PM Updated Updated Jul 22, 2024 | 10:21 PM

OTT Best Comedy Family Drama : ఇప్పుడు చెప్పుకునే కథ కచ్చితంగా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమ , పెళ్లి లాంటి కన్ఫ్యూషన్ లో ఉన్న వారికి ఈ మూవీ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఓ మంచి కామెడీ , ఫ్యామిలీ డ్రామా కోసం చూస్తున్నట్లైతే ఈ మూవీ బెస్ట్ ఛాయస్.

OTT Best Comedy Family Drama : ఇప్పుడు చెప్పుకునే కథ కచ్చితంగా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమ , పెళ్లి లాంటి కన్ఫ్యూషన్ లో ఉన్న వారికి ఈ మూవీ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఓ మంచి కామెడీ , ఫ్యామిలీ డ్రామా కోసం చూస్తున్నట్లైతే ఈ మూవీ బెస్ట్ ఛాయస్.

  • Published Jul 22, 2024 | 10:21 PMUpdated Jul 22, 2024 | 10:21 PM
పెళ్ళైన మొదటి రోజే భార్య ఇంట్లో నుంచి పారిపోతే.. OTT లో ఈ మూవీ మరో లెవెల్

ఓటీటీ లో ఇప్పటివరకు చాలానే ప్రేమ కథా చిత్రాలు చూసి ఉంటారు. ఇక కొన్ని సినిమాలు చూసి అసలు ప్రేమ , పెళ్లి వద్దు అనుకుని ఉంటారు. మరి కొన్ని సినిమాలు చూస్తే.. లైట్ గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేంటి అని ఫీల్ అవుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఫీల్ గుడ్ మూవీ కోసమే. ఇప్పుడు చెప్పుకునే కథ కచ్చితంగా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమ , పెళ్లి లాంటి కన్ఫ్యూషన్ లో ఉన్న వారికి ఈ మూవీ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఓటీటీ లో ఓ మంచి కామెడీ, ఫ్యామిలీ డ్రామా చూడాలని సెర్చ్ చేస్తున్నట్లైతే.. ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలు చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో రమేషన్ అనే వ్యక్తి ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తూ ఉంటాడు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదని బాధపడుతున్న సమయంలో… స్మృతి అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. ఇక వారిద్దరికీ పెద్దల సమక్షంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే వారిద్దరి ఫస్ట్ నైట్ రోజు.. స్మృతి రమేషన్ తో కాస్త స్నేహంగా మాట్లాడి.. అతనిని బయటకు తీసుకుని వెళ్లి.. తానూ సిజ్జు అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పి.. అక్కడికి వచ్చిన అతనితో వెళ్ళిపోతుంది. ఇదంతా రమేషన్ షాక్ లో చూస్తూ ఉండిపోతాడు. ఆ సంఘటనను ఊరిలోని మరొక ఇద్దరు కూడా చూస్తారు. దీనితో ఊరంతా అందరికి ఈ విషయం తెలిసి.. అతని గురించి ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఊరిలో కొంతమంది రమేషన్ ను పద్మిని అని పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడల్లా అతను కోప్పడుతూనే ఉంటాడు.

కట్ చేస్తే రమేషన్ ఊరిలో ఉండే లయ అనే అమ్మాయిని సైలెంట్ గా ప్రేమిస్తూ ఉంటాడు. అయితే , రమేషన్ అమ్మ ద్వారా లయను ఓ రోజు కలుస్తాడు. అయితే రమేషన్ లయ ను తన ఇంటికి తీసుకుని వెళతాడు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇక్కడ రమేషన్ కు మరొక షాక్ ఎదురౌతుంది. అదేంటంటే అప్పటికే రమేషన్ తమ్ముడు రాహుల్ , లయ ప్రేమలో ఉంటాడు. దీనితో రమేషన్ ఎలాగైనా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుని వీటి నుంచి బయటకు రావాలని అనుకుంటాడు. వెంటనే తెలిసిన మ్యారేజ్ బ్యూరోకు వెళ్తాడు, అక్కడ శ్రీ దేవి అనే అమ్మాయితో అతనికి పెళ్ళి చూపులు జరుగుతాయి. కానీ అక్కడ కూడా ఆమెతో గొడవ జరుగుతుంది. మరో వైపు కాలేజ్ లో పద్మిని అనే టీచర్ జాయిన్ అవుతుంది. అయితే ఓ రోజు పద్మినిని గట్టిగా పిలవడంతో.. అది రమేషన్ నే అని అనుకుని.. గొడవ పెట్టుకుంటాడు. అసలు రమేషన్ కు పెళ్ళి అవుతుందా లేదా ! రమేషన్ కు పద్మిని అని పేరుకు ఉన్న సంబంధం ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? లాయర్ శ్రీదేవి తో ఎందుకు గొడవ జరుగుతుంది ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “పద్మిని” అనే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio