iDreamPost
android-app
ios-app

భర్త క్రికెట్ ఆడాలనే ఆశయాన్ని భార్య నెరవేరిస్తే.. OTT లో రీసెంట్ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్

  • Published Jul 27, 2024 | 3:51 PM Updated Updated Jul 27, 2024 | 3:51 PM

OTT Recent Sports Drama Movie : స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కు కూడా ఈ మధ్య చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది చూసేయండి.

OTT Recent Sports Drama Movie : స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కు కూడా ఈ మధ్య చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది చూసేయండి.

  • Published Jul 27, 2024 | 3:51 PMUpdated Jul 27, 2024 | 3:51 PM
భర్త క్రికెట్ ఆడాలనే ఆశయాన్ని భార్య నెరవేరిస్తే.. OTT లో రీసెంట్ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్

చూసే తీరిక ఉండాలే కానీ ఓటీటీ లో లెక్కలేనన్ని సినిమాలు , సిరీస్ లు ఉంటున్నాయి. ఇక వాటిలో అనేక రకాల జోనర్స్ ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ డ్రామా మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి ఫేవరేట్ స్పోర్ట్స్ పర్సన్స్ వారి జీవితాలలో ఎలా ఎదిగారో తెలుసుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాల కోసం సెర్చ్ చేస్తుంటే మాత్రం.. ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఎందుకు మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలను చూసేయండి.

దేశంలో ఎంతో మందికి క్రికెట్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇప్పటికే క్రికెట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కాన్సెప్ట్ మీద రూపొందించిందే. ఇండియా తరపున క్రికెట్ ఆడాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మహేంద్ర అగర్వాల్ అనే వ్యక్తి.. కూడా ఇండియా తరపున ఆడాలని అనుకుని.. దానిని సాదించలేకపోతాడు. మరో వైపు తమ కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవాలని అతని తండ్రి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి మహిమ అనే ఓ డాక్టర్ తో వివాహం చేస్తారు. అయితే ఆమెకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టమని.. తనలానే బాగా ఆడగలదని అతను గుర్తిస్తాడు. దీనితో అతని కలను ఆమె ద్వారా సాకారం చేసుకోవాలని అనుకుంటాడు. క్రికెట్ లో ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. మరి మహిమ క్రికెట్ నేర్చుకోడానికి ఒప్పుకుందా లేదా ? ఇండియ తరపున ఆడిందా లేదా ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ , జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమా మే 31 నథియేటర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక థియేటర్ లో విడుదలైన రెండు నెలల తర్వాత జూలై 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా కేవలం హిందీ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగులోకి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ వీకెండ్ కు ఓ మంచి స్పోర్ట్స్ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్. కాబట్టి ఎంచక్కా ఈ స్పోర్ట్స్ డ్రామాను చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss