iDreamPost
android-app
ios-app

ఆత్మ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంటే! OTT లో బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Aug 01, 2024 | 9:21 PM Updated Updated Aug 01, 2024 | 9:21 PM

OTT Horror Suspense Thriller: హర్రర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సినిమాను కూడా మీ విష్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. ఇది రెగ్యులర్ హర్రర్ కాన్సెప్ట్ లా ఉండే సినిమా అయితే కాదు. మరి అసలు ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Horror Suspense Thriller: హర్రర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సినిమాను కూడా మీ విష్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. ఇది రెగ్యులర్ హర్రర్ కాన్సెప్ట్ లా ఉండే సినిమా అయితే కాదు. మరి అసలు ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 01, 2024 | 9:21 PMUpdated Aug 01, 2024 | 9:21 PM
ఆత్మ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంటే! OTT లో బెస్ట్ హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

హర్రర్ సినిమాలు,సిరీస్ లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్య తెలుగులో కూడా క్రేజ్ పెరగడంతో కొత్త కథలు వస్తూనే ఉన్నాయి. హర్రర్ మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ లో ఉన్న అన్ని మూవీస్ కవర్ చేశామని రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకునేందుకు ఇంకా చాలా హర్రర్ మూవీస్ ఉన్నాయి. హర్రర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సినిమాను కూడా మీ విష్ లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి. ఇది రెగ్యులర్ హర్రర్ కాన్సెప్ట్ లా ఉండే సినిమా అయితే కాదు. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా ఓపెనింగ్ లో ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఆడ్నా అనే ఓ వయసైనా మహిళా ఉంటుంది. నెక్ట్ సీన్ లో ఆమెకు కూతురు , మనుమరాలు ఉంటారు. వారిద్దరికీ పోలీసుల నుంచి కాల్ వస్తుంది. మీ అమ్మ కొద్దీ రోజుల నుంచి కనిపించడం లేదని పక్కింటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఇంట్లోనే ఉందా లేదా ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతారు. దీనితో వారిద్దరూ ఆడ్నా ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటి గోడపైన కొన్ని బ్లాక్ మార్క్స్ ఉంటాయి. అలా ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేస్తారు. కానీ ఆమె ఎక్కడ కనిపించదు. అలాగే మొత్తం అక్కడ కుళ్లిపోయిన ఫ్రూట్స్, కూరగాయలు. కొన్ని నోట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆడ్నాకు మెమరీ లాస్ డిసీస్ ఉంటుంది. అందుకే ఆమె కొన్ని నోట్స్ రాసి స్టిక్ చేసి పెట్టుకుంటుంది.

ఈ క్రమంలో అక్కడ ఒక నోట్ మీద దాని వెనక్కు వెళ్లొద్దు అని రాసి ఉంటుంది. ఈ అమ్మా కూతుళ్ళకు ఏమి అర్థంకాదు. దీనితో పోలీసులతో కలిసి వీరిద్దరూ వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ వెళ్తారు కానీ.. ఏమి ప్రయోజనం ఉండదు. దీనితో తిరిగి ఇంటికి వచ్చి వారిద్దరూ ఇళ్ళు క్లీన్ చేసే పనిలో ఉంటారు. ఈ క్రమంలో ఆ ఇంటి గోడల నుంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ భయపడుతూనే ఆ రాత్రి నిద్రపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పొద్దునే కిచెన్ లో వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆడ్నాను ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ ఏమి సమాధానం చెప్పదు. దీనితో ఆమెను ఒక్కదాన్నే వదిలేయకుండా.. ఆమెను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతుంది. కానీ అప్పటినుంచి కూడా ఆడ్నా తనకు ఎవరో కనిపిస్తున్నారు అని.. వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు ఆడ్నాకు ఏమైంది? ఆమె అసలు ఎక్కడికి పారిపోయింది ? ఆడ్నా ఇంట్లో నుంచి వింత శబ్దాలు ఎందుకు వినిపించాయి ? ఆ తరువాత ఏమైంది ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “రెలిక్” అనే ఈ సినిమాను చూడండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.