Swetha
OTT Best Family Drama : ఫ్యామిలీ డ్రామాస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే పెళ్ళైన ఓ అమ్మాయిని తన అత్తే దగ్గరుండి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కథ ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Best Family Drama : ఫ్యామిలీ డ్రామాస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే పెళ్ళైన ఓ అమ్మాయిని తన అత్తే దగ్గరుండి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కథ ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
కొన్ని సినిమాలు ట్రైలర్ చూసి ఇందులో ఏముందిలే చూడడానికి అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమా చూస్తే కానీ అర్థంకాదు.. కంటెంట్ ఎంత బావుంది అనేది. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా మూవీస్ ఇలానే మిస్ అయిపోతూ ఉంటాయి. కానీ ఆ సినిమాలే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ ఫ్యామిలీ స్టోరీనే.. పెళ్లి అయ్యి కొత్తగా ఇంటికి వచ్చిన కోడలిని.. అత్తగారే దగ్గరుండి.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది. వినడానికే ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూసారా లేదా ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టార్టింగ్ లో మూవీ హీరో అరోమల్.. ఓ గుడికి వెళ్లి చాలా కష్టాల తర్వాత పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వే చూసుకోవాలి అని దేవుడికి మొక్కుకుంటాడు. అయితే అరోమల్ నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో.. వాళ్ళ అమ్మ డ్రైవింగ్ స్కూల్ పెట్టి కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. ఇక అరోమల్ అక్క ఓసారి బస్సులో వెళ్తుండగా ఎవరో ఆమెను ఏడిపిస్తారు. అప్పుడు ఓ వ్యక్తి ఆమెను కాపాడి.. ఆమెకు బాగా దగ్గరయ్యి.. పెళ్ళి కూడా చేసుకుంటాడు. అతను ఎవరో కాదు అరోమల్ వాళ్ళ మామ. ఇక ఇప్పుడు ప్రెసెంట్ లో అరోమల్ కు అమిలికి పెళ్ళి జరుగుతుంది. ఇక పెళ్ళి మొత్తం అయినా తర్వాత.. కొత్త జంటను అరోమల్ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక అరోమాల్ , అమిలి కి మధ్య మాటలు మొదలవుతాయి. కానీ అమిలి మాత్రం అసలు మాట్లాడదు. బహుశా అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడం వలన ఇలా ఉందేమో అని అతను ఎడ్జస్ట్ అయిపోతాడు. ఇక వీరిద్దరికి ఫస్ట్ నైట్ ఎరేంజ్ చేస్తారు పేరెంట్స్. అయితే అప్పుడు అతను మందు తాగి అమిలి దగ్గరకు వెళ్తాడు.
కట్ చేస్తే.. అక్కడ కూడా అరోమల్ మాట్లాడతాడు కానీ అమిలి మాత్రం ఏమి మాట్లాడాదు. అయితే అమిలి అతనిని నీకేదైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది. అతనికి పాస్ట్ లో లవ్ ఉన్నా కానీ.. చెప్తే తన వైఫ్ ఎక్కడా ఫీల్ అవుతుందా అని చెప్పడు. కానీ అమిలి మాత్రం తనకు గతంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నిన్ను చేసుకున్నాను అని చెప్తుంది. అంతే కాకుండా ఇంట్లో గోల గోల చేస్తుంది. అయితే ఆమె తాగేసి అలా మాట్లాడుతుందని అర్థమౌతుంది అరోమల్ కు. ఇక అప్పటినుంచి రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవలు జరుగుతాయి. అమిలి మాత్రం తనకు తన బాయ్ ఫ్రెండ్ కావాలని గోల చేస్తుంది. దీనితో అరోమల్ అమ్మ అమిలిని తీసుకుని.. తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకుని వెళ్తా అని చెప్పి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? అమిలికి తన బాయ్ ఫ్రెండ్ కు మధ్య ఏం జరిగింది ? అరోమల్ ఏం చేస్తాడు ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే “మందాకినీ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. ప్రేమలో మోసపోయిన ప్రతి మగాడు చూడాల్సిన చిత్రం! యాంజిలీనా జోలీ వింటేజ్ థ్రిల్లర్!