OTT Suggestions - Recent Romantic Thriller: ప్రేమ,అబద్దాలు,రక్తపాతం.. OTT లో రీసెంట్ రొ*మాంటిక్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

ప్రేమ,అబద్దాలు,రక్తపాతం.. OTT లో రీసెంట్ రొ*మాంటిక్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

OTT Recent Romantic Thriller In Telugu : రీసెంట్ గా కొన్ని హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి రీసెంట్ హాలీవుడ్ రొ*మాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Recent Romantic Thriller In Telugu : రీసెంట్ గా కొన్ని హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి రీసెంట్ హాలీవుడ్ రొ*మాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

వీకెండ్ వచ్చేసిందంటే ఓటీటీ లో ఏ ఏ సినిమాలు చూద్దామా అని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. అయితే ఈ వారం ఓటీటీ లో మరి అంత ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే ఏమి లేవు కానీ.. టైమ్ పాస్ కు చూసేందుకు మాత్రమే చాలానే సినిమాలు ఉన్నాయి. అయితే కొన్ని కామెడీ మూవీస్ మాత్రం కాసేపు చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు. అవి కాకుండా ఏదైనా రొ*మాంటిక్ థ్రిల్లర్, వాచ్ ఎలోన్ మూవీ చూడాలంటే మాత్రం.. రీసెంట్ గా వచ్చిన ఈ హాలీవుడ్ రొ*మాంటిక్ థ్రిల్లర్ బెటర్ ఛాయస్ అని చెప్పి తీరాలి. అందులోను ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఎంతైనా ఇతర భాషల సినిమాలను తెలుగులో చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఓ హాలీవుడ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా రన్ టైమ్ మొత్తం 1గంట45 నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి.. ఈజీగా చూసేయొచ్చు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే. లోయి అని అమ్మాయి ఓ జిమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమె ఒక లెస్బియన్ . ఆ జిమ్ లో జాక్ అనే మరో అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆమె హల్క్ లా ఉంటుంది.. ఆమె గోల్ ఏంటంటే ఎప్పటికైనా బాడీ బిల్డింగ్ కాంపిటేషన్ లో పాల్గొని విన్ అవ్వాలని. ఇక అప్పటికే ఆమె మంచి పిజిక్ తో బాడీ తో ఉండడడంతో.. అసలే లెస్బియన్ అయినా లోయి .. ఆమెను చూసి అట్ట్రాక్ట్ అవుతుంది.

కట్ చేస్తే.. మెల్లగా వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలయ్యి.. పరిచయం పెరిగి ఇద్దరు రిలేషన్ కంటిన్యూ చేస్తారు. అయితే అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి వారిద్దరూ ఓ మర్డర్ కేస్ లో ఇరుక్కుంటారు. అసలు ఆ మర్డర్ ఏంటి ? ఎవరు చేశారు ? వీరిద్దరూ ఎందుకు బుక్ అయ్యారు? అనేది తెలియాలంటే “లవ్ లైస్ బ్లీడింగ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అయితే కాదు. వాచ్ ఎలోన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ సజ్జెషన్. కాబట్టి ఎంచక్కా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. ఒక మర్డర్ 9 మంది హంతకులు.. OTT లో నిమిషానికో ట్విస్ట్ తో కిక్ ఇచ్చే మూవీ

Show comments