Swetha
OTT Feel Good Movie: మలయాళీ సినిమాలు ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు మలయాళంలో ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ ను చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. ముఖ్యంగా అమ్మాయిలు చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
OTT Feel Good Movie: మలయాళీ సినిమాలు ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు మలయాళంలో ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ ను చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే. ముఖ్యంగా అమ్మాయిలు చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
Swetha
కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎదో ఒక మెసేజ్ ను ఇచ్చే విధంగా.. రూపొందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలలో ఈ విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మలయాళీ సినిమాలు ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు మలయాళంలో ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ ను చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సింపుల్ స్టోరీ గురించే. పైగా ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే .. జెస్సి ఒక అందమైన అమాయకపు అమ్మాయి. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇంట్లోనే ఉంటూ.. వాళ్ళ అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. అలా ఓ రోజు వాళ్ళ అమ్మ ఎవరికో కాల్ చేయమని చెప్తే.. ఈ అమ్మాయి ఇంకెవరికో కాల్ చేస్తుంది. అతను ఒక ఆటో డ్రైవర్. రాంగ్ నెంబర్ అని ఆమె ఎంత చెప్పినా సరే.. ఆ ఆటో డ్రైవర్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఆమెకు కాల్ చేస్తూనే ఉంటాడు. అలా కొంతకాలానికి వీరిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక మరో వైపు జెస్సిని అదే ఊరిలో ఉండే ఓ వ్యాపారి కూడా ప్రేమిస్తూ ఉంటాడు. జెస్సి ఏమో ఆ ఆటో డ్రైవర్ ను ప్రేమిస్తూ ఉంటుంది.
కట్ చేస్తే అంత కాలం కేవలం ఫోన్స్ లోనే సాగిన వీరి ప్రేమ ప్రయాణం.. ఒకరినొకరు చూసుకోవాలని అనుకుంటారు. ఓ వైపు ఊరిలో ఆ బట్టల వ్యాపారి తన తల్లిదండ్రులను తీసుకుని.. జెస్సి ఇంటికి పెళ్లి గురించి మాట్లాడానికి వస్తాడు. దీనితో జెస్సి భయంతో ఆ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లిపోవాలని బయల్దేరుతుంది. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురౌతాయి. అసలు ఆ ఆటో డ్రైవర్ మంచి వాడేనా ? ఆ తర్వాత ఏమైంది ? జెస్సికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ? చివరికి ఎలా ముగిసింది ? అనేది తెలియాలంటే “కప్పేలా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులో ఇదే కథను ‘బుట్ట బొమ్మ’ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.