Swetha
OTT Best Family Drama: ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తయితే... తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చే సినిమాలు ఒక మరొక ఎత్తు. ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
OTT Best Family Drama: ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తయితే... తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చే సినిమాలు ఒక మరొక ఎత్తు. ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.
Swetha
ఎప్పుడు హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలనే కాకుండా తెలుగు సినిమాలను కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే తెలుగులో కూడా ప్రేక్షకుల మనసులను దోచేసే ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయి. మిస్టరీ థ్రిల్లర్స్, ఫామిలీ డ్రామాస్, హర్రర్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో చాలానే సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి. ఇక ఓటీటీ లో ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తయితే… తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వచ్చే సినిమాలు ఒక మరొక ఎత్తు. ఈ జోనర్ లో వచ్చే సినిమాలకు, ముఖ్యంగా ఆ యాస కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమానే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
ఈ సినిమా పేరు ఇంటింటి రామాయణం. ఈ సినిమాను సురేష్ నరెడ్ల డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలోనరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజిమామ, బిత్తిరి సత్తి లాంటి వాళ్ళు ప్రధాన పాత్రలలో నటించారు. ఇంటింటి రామాయణం సినిమా ఓ మంచి ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాలో చాలా వరకు ప్లాట్స్ నేటివిటీ కి దగ్గరగా ఉంటాయి . అందరికి ఈజీగా కనెక్ట్ అవుతాయి. పల్లెటూరి ముచ్చట్లు చూడాలని అనుకునే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.
అసలు ఏంటి ఈ ఇంటింటి రామాయణం కథ అనే విషయానికొస్తే.. ఈ సినిమాలో నరేష్ ఓ మంచి మనిషి. అందరితో మంచిగా ఉంటూ.. అందరు బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. ఇక అతని స్నేహితుడు కుమారుడు రాహుల్ రామకృష్ణ. అతని ఫ్రెండ్ చనిపోవడం వలన రాహుల్ ను సొంత కొడుకుల చూసుకుంటాడు. అయితే నరేష్ కు తెలీకుండా.. రాహుల్ అతని కూతురుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తాడు. ఓ రోజు నరేష్ ఇంట్లో అందరు పదిరోజుల పాటు వేరే ఊరికి వెళ్తారు. దీనితో నరేష్ బామ్మర్ది పార్టీ చేసేందుకు అంతా సిద్ధం చేస్తాడు. పది రోజుల పాటు ఇష్టం వచ్చినట్లు అంతా ఎంజాయ్ చేస్తారు. అయితే సడెన్ గా నరేష్ భార్య తిరిగి వచ్చేసరికి.. వాళ్ళ ఇంట్లో బంగారం కనిపించదు. ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్తుంది. ఇంట్లోని వాళ్లనే పోలీసులు అనుమానిస్తారు. అసలు ఆ బంగారం తీసింది ఎవరు ! రాహుల్ ప్రేమ విషయం నరేష్ కు తెలిసిందా ! వారు కలిసే ఉన్నారా లేదా ! తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.