OTT Suggestion - Best Suspense Thriller : OTT లో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఉండరు.. వీక్ హార్ట్ పీపుల్ చూడొద్దు

OTT Suggestion : OTT లో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చూసి ఉండరు.. వీక్ హార్ట్ పీపుల్ చూడొద్దు

OTT Best Suspense Thriller :కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ అసలు ట్విస్ట్ ఏంటి అనేది అర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Suspense Thriller :కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ అసలు ట్విస్ట్ ఏంటి అనేది అర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా మీ వాచ్ లిస్ట్ లో ఉందో లేదో ఓ లుక్ వేసేయండి.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. దాదాపు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా ఇలానే ఉంటూ ఉంటాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో ప్లాట్ ఒకటే అయినా కూడా.. ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఈ జోనర్ సినిమాలను చూసేలా చేస్తాయి. ఇక వాటిలో కొన్ని సినిమాలు చివరి వరకు చూస్తే కానీ.. అసలు ట్విస్ట్ ఏంటి అనేది అర్ధం కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. కొలీన్ అనే మహిళ.. తన కూతుళ్లయినా బెత్ , వీర తో కలిసి కార్ లో వెళ్తూ ఉంటుంది. దారిలో బెత్ తాను రాసిన స్టోరీని చెప్తూ ఉంటుంది . దానికి కొలీన్ స్టోరీ చాలా బావుంది అని ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వీర మాత్రం అసలు బాలేదు అని ఆమెను హేళన చేస్తూ ఉంటుంది. అలా వారు వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్లగా.. అక్కడ వారికి అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొలీన్ తన కూతుళ్లపై అటాక్ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తిని చంపేస్తుంది. కట్ చేస్తే స్టోరీ పదహారేళ్ళ తర్వాత చూపిస్తారు.. ఇక్కడ బెత్ కు ఒక మంచి రైటర్ గా సెటిల్ అవుతుంది. ఆమె ఇన్సిడెంట్ ఇన్ ఘోస్ట్ ల్యాండ్ అనే ఓ బుక్ ను రాయడంతో.. ఆ బుక్ బాగా సక్సెస్ అయ్యి.. మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది. అంత బాగానే సాగుతున్న సమయంలో.. ఓ రోజు రాత్రి బెత్ సిస్టర్ వీర తనకు కాల్ చేసి.. నన్ను వదిలి వెళ్లొద్దు అంటూ కంగారుగా మాట్లాడుతుంది.

దీనితో బెత్ తన హస్బెండ్ తో.. వీర 16 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలను మర్చిపోలేకపోతుందని.. వెంటనే తనను కలవడానికి వెళ్లాలని చెప్పి వెళ్తుంది. తీరా వీర ఉన్న ప్లేస్ కు వెళ్లి చూస్తే .. వీర ఇంకా ఆ సంఘటనలను మర్చిపోలేకపోతుందని.. అప్పటినుంచి ఇంటి బేస్మెంట్ లోనే ఉందని తన తల్లి చెప్తుంది. అయితే ఆరోజు రాత్రి బెత్ కు ఆ ఇంట్లో చాలా విచిత్రమైన సంఘటనలు ఎదురౌతాయి. అసలు పదహేరేళ్ళ క్రితం ఏం జరిగింది ! వీర ఎందుకు అంతలా భయపడుతుంది ! బెత్ తన చెల్లిని ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటకు తీసుకుని వస్తుంది ! అసలు వీరను వెంబడిస్తుంది ఎవరు ! ఎందుకు వీర నే టార్గెట్ చేశారు ! అసలు బెత్ నిజంగా ఫ్యూచర్ లో ముందుకు వెళ్లిందా ! బెత్ కథ నిజామా.. వీర కథ నిజామా ! ఇవన్నీ తెలియాలంటే “ఇన్సిడెంట్ ఇన్ ఘోస్ట్ ల్యాండ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments