iDreamPost
android-app
ios-app

ప్రతి పాతికేళ్ళకు ఓ కుటుంబం మాయం.. OTT లో భయపెడుతూ థ్రిల్ చేసే మూవీ

  • Published Jul 11, 2024 | 1:12 PM Updated Updated Jul 11, 2024 | 1:12 PM

OTT Korean Thriller Movie In Telugu: రీసెంట్ గా ఓటీటీ లో ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ మూవీ రిలీజ్ అయింది. అది కూడా థియేటర్ లో రిలీజ్ అయిన ఏడేళ్ల తర్వాత ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చింది. పైగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Korean Thriller Movie In Telugu: రీసెంట్ గా ఓటీటీ లో ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ మూవీ రిలీజ్ అయింది. అది కూడా థియేటర్ లో రిలీజ్ అయిన ఏడేళ్ల తర్వాత ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చింది. పైగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీని మీరు చూశారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

  • Published Jul 11, 2024 | 1:12 PMUpdated Jul 11, 2024 | 1:12 PM
ప్రతి పాతికేళ్ళకు ఓ కుటుంబం మాయం.. OTT లో భయపెడుతూ థ్రిల్ చేసే మూవీ

కొరియన్ సిరీస్ అనగానే అందరికి లవ్ డ్రామాస్ మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. అయితే వీటిలో మంచి మంచి హర్రర్ మూవీస్ కూడా ఉన్నాయి. కే డ్రామాస్ తో ప్రేమలో పడని వారు ఎవరు ఉండరు. ఇప్పటివరకు ఎవరైనా కొరియన్ మూవీస్ చూడకపోతే.. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా కొరియన్ డ్రామాస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీ లో ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ మూవీ రిలీజ్ అయింది. అది కూడా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడేళ్ల తర్వాత ఓటీటీ లో అడుగుపెట్టింది. పైగా ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఏంటి ఈ మూవీని మీరు చూశారా లేదా.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

అసలు ఈ మూవీ కథేంటంటే.. ఈ కథ 1992 లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మిహు అనే మహిళ ఒంటి నిండా దెబ్బలతో ఇంటి బేస్మెంట్ లో పడి ఉంటుంది. ఆ గాయాలతోనే తన కొడుకుని కూడా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇంతలోనే ఆమెను ఎదో శక్తి బేస్మెంట్ లోకి లాక్కెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది. కట్ చేస్తే ఇంకొక సీన్ చూపిస్తారు. తన భర్తను చంపినందుకు, తన కొడుకు కనిపించకుండా పోయినందుకు మిహును అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. అయితే పాతికేళ్ల తర్వాత మిహుకు గొంతు క్యాన్సర్ రావడంతో.. ఆమెను జైలు నుంచి విడుదల చేస్తారు పోలీసులు. ఆమెను తన ఇంట్లోనే ఉంచి.. సెక్యూరిటిగా పోలీసులు ఉంటారు. ఈ క్రమంలో ఆమెను కలవడానికి పోలీసుల పెర్మిషన్ తీసుకుని ఓ ఫాదర్ వస్తాడు. అప్పుడు మిహు పాతికేళ్ల క్రితం ఏం జరిగింది అనే విషయాన్నీ చెప్తుంది.

మిహు మొదటి భర్త క్యాన్సర్ తో చనిపోవడంతో.. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అప్పటికే మిహుకు ఓ కొడుకు ఉంటాడు. ఇక రెండో పెళ్లి తర్వాత మరొక బిడ్డకు కూడా జన్మనిస్తుంది. అయితే ఆమె రెండో భర్త కూడా ఆమెను మోసం చేసి.. మరొకరితో రిలేషన్ లో ఉంటాడు. దీనితో అతనిని కూడా ఈమె దూరం పెడుతుంది. కానీ పిల్లలతో మాత్రం ఈమె సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె పెద్ద కొడుకు పొరపాటు వలన చిన్న కొడుకు మరణిస్తాడు. దీనితో మిహు భర్త ఆమె పెద్ద కొడుకుని చంపాలని అనుకుంటాడు. కానీ అతనే చనిపోతాడు. ఆ తర్వాత తన కొడుకు బేస్మెంట్ లోకి వెళ్లిపోయాడని చెప్తుంది మిహు.

దీనితో అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోడానికి ఆ ఫాదర్ ప్రయత్నిస్తాడు. ఆ ఇంటి ఓనర్స్ ఎవరు అనే విషయం కనుక్కుంటాడు. ఈ క్రమంలో అతనికి పాతికేళ్ల క్రితం ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్స్ ను ఎవరో చంపేశారానే న్యూస్ తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాదు. కానీ పాతికేళ్ళకు ఓ సారి మాత్రం ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు.. అనూహ్యంగా మాయమైపోతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ? ఎందుకని ఎవరికీ అర్థంకాని విధంగా మనుషులు మాయమైపోతూ ఉంటారు ? ఆ ఇంటి బేస్మెంట్ లో ఏముంది ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ” హౌస్ ఆఫ్ ది డిస్సపియర్డ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి .. OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. కన్న కూతురిని చంపాలనుకునే పేరెంట్స్!