హీరోయిన్ కి ఎయిడ్స్.. హిజ్రాతో జీవనం.. OTTలో సోషల్ మెసేజ్ మూవీ!

OTT Best Social Messege Movie : కొన్ని సినిమాలు ఎవరైనా చూడమని చెప్పేవరకు కూడా ఆ సినిమా వేల్యూ తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే కనుక ఓ మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీని మిస్ అయినట్లే.

OTT Best Social Messege Movie : కొన్ని సినిమాలు ఎవరైనా చూడమని చెప్పేవరకు కూడా ఆ సినిమా వేల్యూ తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే కనుక ఓ మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీని మిస్ అయినట్లే.

ఓటీటీ లో ఉండే సినిమాలన్నీ కూడా రకరకాల జోనర్స్ లో ఉంటూ ఉంటాయి. ఇక వీటిలో రెగ్యులర్ గా అందరు చూసే సినిమాలు దాదాపు హర్రర్, సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా లైఫ్ లో ఇన్స్పైర్ చేసే సినిమాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి సినిమాలైతే ఎవరైనా చెప్పేవరకు కూడా .. ఆ సినిమా వేల్యూ ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. కొన్ని సినిమాలు జీవితంలో ఓసారైనా చూడాలని అంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. అరువి అనే అమ్మాయిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ ను ఎంక్వయిరీ చేస్తూ ఉంటారు. అప్పటికే అక్కడకు మీడియా వాళ్లంతా వచ్చేస్తారు. ఆమె ఒక తీవ్రవాది అని.. కానీ ఆమె ఏ గ్రూప్ కు చెందిన వ్యక్తి అనేది అయితే తెలియదు. అరువి ని బాగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే ఇక్కడ అరువి గతాన్ని చూపిస్తారు. ఓ చిన్న పల్లెటూరిలో అరువి తన పేరెంట్స్ తో కలిసి ఉంటుంది. ఆమెను తన అమ్మా నాన్న అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అరువి నాన్నకు సిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అరువికి సిటీ వాతావరణం పడదు. అలా కథను ప్రెసెంట్ లోకి కూడా చూపిస్తారు. అరువిని ఇంట్రాగేషన్ చేసే సమయంలో.. అరువి ఫ్రెండ్ జెస్సి ని కలుస్తారు.

అయితే.. అరువి , జెస్సి గతంలో చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ కలిసి కాలేజ్ లో చదువుకున్న సమయంలో.. అరువి వాంతులు చేసుకోవడంతో .. ఆమె తల్లిదండ్రులు ప్రెగ్నెంట్ అనుకుని.. ఆమె ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా సరే.. తన తల్లిదండ్రులు నమ్మరు. దీనితో ఆమె జెస్సి హెల్ప్ తీసుకుని.. ఓ హాస్టల్ లో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు ఓ హిజ్రా అయినా ఎమిలీ పరిచయం అవుతుంది. అప్పటివరకు జీవితంలో చేయలేనివి అన్ని కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత స్టోరీని ప్రెసెంట్ లో చూపిస్తూ ఎమిలీని కూడా ఇంట్రాగేషన్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఆ పోలీస్ ఆఫీసర్ ఓ ప్రముఖ టీవీ షో ప్రోగ్రాం డైరెక్టర్ బాలాజీ ను కలిసి.. అరువి గురించి అడుగుతాడు. అప్పుడు బాలాజీ జరిగిందంతా చెప్తాడు.

అసలు అక్కడ ఏం జరిగింది ? ఎందుకు అరువిని అరెస్ట్ చేసి తీవ్రవాది అనే ముద్ర వేశారు? అరువికి గతంలో ఏం జరిగింది ? ఆమెకు ప్రెగ్నెంట్ కాకపోయినా సరే.. ఆమెను ఇంటి నుంచి ఎందుకు తరిమేశారు ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అరువికి , ఎమిలీకి ఉన్న సంబంధం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “అరువి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments