OTT లో డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది.

OTT Best Psychological Suspense Thriller: కొన్ని సినిమాలు చివరి వరకు కూడా అసలు కథ ఇది అని అర్ధం కాదు. ఇలాంటి సినిమాలలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే, మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

OTT Best Psychological Suspense Thriller: కొన్ని సినిమాలు చివరి వరకు కూడా అసలు కథ ఇది అని అర్ధం కాదు. ఇలాంటి సినిమాలలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే, మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

ఓటీటీ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు ఉన్నా కానీ.. సైకాలాజికల్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం నెక్ట్ లెవెల్ లో ఉంటాయి. అసలు చివరి వరకు ఆ ట్విస్ట్ ను గెస్ చేయడం ఎవరి వలన కాదు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ అన్ని కూడా ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమ కూడా ఇలాంటిదే. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎవరు ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో.. ఏది నిజమో.. ఏది ఇమాజినేషన్ అనేది చివరి వరకు సస్పెన్స్ లోనే ఉంటుంది. మరి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏంటి ? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఈ మూవీని మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ఆల్బర్ట్ వాళ్ళ నాన్న ఓ సైన్స్ టీచర్. అతనితో వాళ్ళ నాన్న మనం ఏం పని చేసిన వెంటనే ప్రశ్నలు మన మైండ్ లోకి రావాలి అని చెప్తాడు. ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్న ఏది లేదని చెప్తాడు. ఇక అప్పటినుంచి అతను పెద్ద సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అనుకున్నట్లుగానే అతను ఆస్ట్రాలజిస్ట్ అవుతాడు. అతను ఓ ప్రేమ వివాహాన్ని కూడా చేసుకుంటాడు. ఈ క్రమంలో వారికి ఆడమ్ అనే కొడుకు పుడతాడు. కానీ అతని భార్య మాత్రం చనిపోతుంది. అలా కాలం గడిచిపోతుంది. అయితే సైంటిస్ట్ ల అంతా కూడా ఓ వింత తోక చుక్క భూమి మీద పడుతుందని.. అది కనుక పడితే .. 9 రోజుల పాటు కరెంట్ ఉండదని చెప్తారు. ఆ తోక చుక్క భూమి మీద పడడానికి ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ లోపే ఆడమ్ స్కూల్ లో ఎదో పిచ్చి పని చేయడంతో అతనికి టీసీ ఇచ్చి పంపించేస్తారు. దీనితో ఆల్బర్ట్ అతనిపై కోప్పడతాడు. అతను కొడుకు భాధపడడంతో.. అప్పటినుంచి అతని కొడుకుతో మంచిగా ఉంటాడు.

కట్ చేస్తే .. ఇక ఆ తోక చుక్క భూమి మీద పడే రోజు దగ్గర పడుతుంది. దీనితో ప్రజలంతా కూడా భయంతో.. ఆ 9 రోజులకు సరిపడా వసతులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఆల్బర్ట్ ఆ తోక చుక్క గురించి పరిశోదించే ప్రాసెస్ లో ఉంటాడు. ఆ రోజు రానే వస్తుంది. ఆ తోక చుక్క పడిన ప్రదేశానికి అతను వెళ్తాడు. ఈ క్రమంలో అతనికి అక్కడ ఓ అమ్మాయి ఎదురౌతుంది. ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆమెను తన కొడుకు కూడా పరిచయం చేస్తాడు. వారిద్దరూ త్వరగానే మంచి ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఆ అమ్మాయి దగ్గర ఆ తోక చుక్కకు సంబంధించిన స్టోన్ ఉంటుంది. దానిని ఆల్బర్ట్ తీసుకుంటాడు. అయితే ఆమెను తన ఊరిలో దింపడానికి వెళ్తాడు. కానీ అది జరగదు దీనితో తిరిగి ఆమెను తన గెస్ట్ హౌస్ కు తీసుకుని వెళ్తాడు.

విషయం ఏంటంటే తానే ఆ తోక చుక్క. ఈ విషయం ఆడమ్ కు చెప్తుంది. ఆడమ్ ఆల్బర్ట్ తో ఈ విషయం చెప్పనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు ఆ తోక చుక్క ఎందుకు ఆల్బర్ట్ దగ్గరకు వచ్చింది ? వచ్చిన ఆ అమ్మాయే తోక చుక్క అని ఆల్బర్ట్ కు తెలుస్తుందా లేదా ? తన కొడుకు మాటలు ఆల్బర్ట్ నమ్ముతాడా లేదా ? అసలు తోక చుక్క ఎందుకు భూమి మీద పడుతుంది ? అసలు ఆ తోక చుక్క రూపంలో ఉన్న అమ్మాయి నిజమేనా ? ఇవన్నీ తెలియాలంటే “9” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చూడండి.. OTT లో భయంకరమైన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడకూడని మూవీ

Show comments