OTT Suggestion: అందమైన పల్లెటూరి ప్రేమ కథ.. OTTలో బెస్ట్ లవ్ స్టోరీ

OTT Feel Good Movie : ఓటీటీ లో ఎప్పుడు హాలీవుడ్, బాలీవడ్ చిత్రాలే కాకుండా.. అప్పుడప్పుడు తెలుగు సినిమాలను కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ తెలుగు సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

OTT Feel Good Movie : ఓటీటీ లో ఎప్పుడు హాలీవుడ్, బాలీవడ్ చిత్రాలే కాకుండా.. అప్పుడప్పుడు తెలుగు సినిమాలను కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ తెలుగు సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

సస్పెన్స్ సినిమాలతో పాటు.. కొంతమంది ఎమోషనల్ మూవీస్ ను చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. వారం వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే వాటిలో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేసినా కానీ.. చాలా మంది వాటిలో తెలుగు సినిమాలు ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎంత హాలీవుడ్ , బాలీవుడ్ సినిమాలను చూసినా కానీ.. తెలుగు సినిమాలను చూస్తే.. ఆ ఫీల్ వేరే ఉంటుంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే తెలుగు సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఎటువంటి హై సస్పెన్స్ లు లేకుండా సింపుల్ గా చిన్న ట్విస్ట్స్ తో సాగిపోయే కథ. ప్రేమ కథలంటే అందరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ ఏ ప్రేమ కథకు కూడా అంత ఈజీగా ఎండ్ కార్డు పడదు. ప్రతి ప్రేమ కథలోనూ.. ఊహించని ఎన్నో మలుపులు.. అనుకోని సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. ఇప్పటివరకు చాలానే సినిమాలలో ఇలాంటి సన్నివేశాలను చూసే ఉంటాము. ఈ సినిమాలో కూడా దాదాపు కథ అలానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది 1996 లో ధర్మపురి అనే గ్రామంలో జరిగిన కథ.. తెలంగాణలోని ధర్మ పురి అనే గ్రామంలో.. సర్పంచ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు సూరి అనే యువకుడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మల్లి అనే అమ్మాయిని కలుస్తాడు. అయితే మొదటి చూపులోనే అతను మల్లితో ప్రేమలో పడతాడు.

ఆమె కూడా మొదటి చూపులోనే సూరితో ప్రేమలో పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ వారి ప్రేమ పెళ్ళికి దారితీస్తుంది. కానీ, అంత సులువుగా వారి పెళ్లి జరగదు. పైగా వీరి ప్రేమకు కుటుంబ సభ్యులతో పాటు.. రాజకీయ సమస్యలు కూడా చుట్టుముడతాయి. అయినా సరే వారు విడిపోకుండా కలిసే ఉండాలనే నిర్ణయం తీసుకుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో సూరి మిస్ అవుతాడు. అసలు సూరి ఏమయ్యాడు ! వీరి ప్రేమకు అడ్డుగా నిలిచిన వారు ఎవరు ! సూరిని వెతకడం కోసం మల్లి ఏం చేస్తుంది ! చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా లేదా ! సూరి సేఫ్ గా ఉన్నాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “1996 ధర్మపురి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments