iDreamPost
android-app
ios-app

OTTలో ఈ హారర్ చిత్రానికి.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

  • Published Jun 05, 2024 | 5:47 PM Updated Updated Jun 05, 2024 | 5:47 PM

ఈ మధ్య కాలంలో దుప్పటి చాటున ముసుగేసుకుని ఫీల్ అయ్యే హారర్ చిత్రాలు రాలేదు. అలాగే చెమటలు పట్టించే సస్పెన్ థ్రిల్లర్ వచ్చినట్లు లేదు. అయితే ఓ సారి ఈ పాత సినిమాపై లుక్కేయండి. ఈ రెండు ఫీల్ అవుతారు

ఈ మధ్య కాలంలో దుప్పటి చాటున ముసుగేసుకుని ఫీల్ అయ్యే హారర్ చిత్రాలు రాలేదు. అలాగే చెమటలు పట్టించే సస్పెన్ థ్రిల్లర్ వచ్చినట్లు లేదు. అయితే ఓ సారి ఈ పాత సినిమాపై లుక్కేయండి. ఈ రెండు ఫీల్ అవుతారు

  • Published Jun 05, 2024 | 5:47 PMUpdated Jun 05, 2024 | 5:47 PM
OTTలో ఈ హారర్ చిత్రానికి.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

హాలీవుడ్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో కూడా థియేటర్లలో హాలీవుడ్ చిత్రాలు వస్తున్నాయంటే.. క్యూ కట్టేవారు తెలుగు ఆడియన్స్. జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, అనకొండ, టైటానిక్ మొదలుకుని అవెంజర్స్ మూవీస్ వరకు వదిలిపెట్టకుండా చూస్తూ ఉంటారు. అలాగే టీవీల్లో ఇంగ్లీష్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాలు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని.. కొత్తవి, పాతవి కలగలిపి చూస్తుంటారు. ముఖ్యంగా యాక్షన్ అండ్ హారర్ మూవీలను బాగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా హారర్ చిత్రాలు అనగానే దెయ్యాలు, భూతాలు అనే అపోహ ఉంది. అలా కాకుండా మనుషులే దెయ్యాలుగా యాక్ట్ చేస్తూ కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు అలాంటి క్యూరియాసిటినీ కలిగించే ఓ మూవీని చూడకపోతే.. ఈ వారం చూసేయండి.

అదే ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్. 2008లో వచ్చిన ది స్ట్రేంజర్స్ సీక్వెల్ ఈ చిత్రం. 2018లో ఈ సినిమా వచ్చింది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. తక్కువ సమయంలో మంచి హారర్ మూవీ ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఇది బెస్ట్ వాచబుల్ మూవీ.. బైలీ మాడిసన్, లెవిస్ పుల్‌మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్‌సన్, డామియన్ మాఫీ, లీ ఎన్‌స్లిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో లభిస్తుంది. సబ్ టైటిల్స్‌తో మేనేజ్ చేయొచ్చు. ఇదొక సరికొత్త హారర్ థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇక ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే..

Horror Movie

బైలీ మాడిసన్, లెవిస్ పుల్‌మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్‌సన్ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్‌ ఎంజాయ్‌ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు వెంబడిస్తున్నారు? ఆ ముగ్గురు నుండి ఫ్యామిలీ తప్పించుకుందా తెలియాలంటే.. ‘ది స్ట్రేంజర్స్‌ :ప్రే ఎట్ నైట్’ చూడాల్సిందే. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్‌కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది. హారర్‌ జోనర్‌ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్‌: ప్రే ఎట్ నైట్ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobet