iDreamPost
android-app
ios-app

మరికొన్ని గంటల్లో OTTలోకి ప్రేమమ్ హీరో సినిమా .. తెలుగులో కూడా

  • Published Jul 04, 2024 | 2:09 PM Updated Updated Jul 04, 2024 | 2:09 PM

ప్రేమమ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు నివిన్ పౌలీ. అతడు తాజాగా ఓ మూవీ థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రేమమ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు నివిన్ పౌలీ. అతడు తాజాగా ఓ మూవీ థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Jul 04, 2024 | 2:09 PMUpdated Jul 04, 2024 | 2:09 PM
మరికొన్ని గంటల్లో OTTలోకి ప్రేమమ్ హీరో సినిమా .. తెలుగులో కూడా

తెలుగు సినీ ప్రేక్షకులు మామూలోళ్లు కాదు.. మూవీ లవర్స్. థియేటర్లలో చిత్రాలనే కాకుండా ఓటీటీల్లో ప్రతి వీక్ వచ్చే సినిమాలను చూసి ఆదరిస్తుంటారు. స్వభాషా చిత్రాలనే కాకుండా.. పర భాషా చిత్రాలను కూడా మావే అని ఫీల్ అవుతుంటారు. కాస్తంత కంటెంట్ ఉంటే చాలు ఈ సినిమా బాగుంది రా అంటూ పది మందితో చర్చిస్తుంటారు. ఓటీటీలో వీరి వ్యూవర్ షిప్ కూడా బాగుంటుంది. అందుకే ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శక, నిర్మాతలు తమ సినిమాలను తెలుగులో డబ్ చేసి.. అందిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు దక్కుతున్న ఆదరణ చాలా ఎక్కువ. ఇటీవల కాలంలో మాలీవుడ్ చిత్రాలన్నీ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఓ ఇంట్రస్టింగ్ మాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

ప్రేమమ్, బెంగళూర్ డేస్ వంటి మలయాళ చిత్రాలతో తెలుగు వారికి కాస్తంత తెలిసిన హీరో నివిన్ పౌలీ. అతడు నటించిన తాజా చిత్రం ‘మలయాళీ ఫ్రం ఇండియా’. ఈ ఏడాది మే 1న రిలీజ్ అయ్యింది. ఫక్తు డ్రామా మూవీ. నేరు, గురువాయిర్ అంబలనడయల్ వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న అనశ్వర రాజన్ హీరోయిన్. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించాడు. ఇందులో తెలుగులో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న విలన్ షైన్ టామ్ చాకో క్యామియో పాత్రలో మెరిశాడు. సినిమా మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం కానుంది ఈ మూవీ. సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. జులై 5 నుండి ఈ సినిమాను చూసేయొచ్చు. అంటే ఈ మూవీ  4వ తేదీ అర్థరాత్రి నుండే స్ట్రీమింగ్ కాబోతుంది. మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది ‘మలయాళీ ఫ్రం ఇండియా’. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. కేరళలోని అల్పరంబిల్ గోపి (నివిన్ పౌలీ) కేరళలోని ముల్లకరలోనివసిస్తుంటాడు. అతడో నిరుద్యోగి. క్రికెట్ ఆడుతూ.. రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ టైం పాస్ చేస్తుంటాడు. అయితే ఓ సమయంలో ఆ ఊరిలో గొడవలు మొదలవుతాయి. ఇందులో గోపీ ఇరుక్కుంటాడు. అతడ్ని ఈ గొడవల నుండి తప్పించేందుకు పోలీసులు.. విదేశాలకు పంపిస్తారు. ఊరు దాటని గోపీ.. తెలియని ప్రపంచానికి వెళతాడు. అక్కడ ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom