ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ కొత్త సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Netflix New Series : వైవిధ్య భరితమైన కంటెంట్ ను అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మొదటి సారి.. ఓ యాక్షన్ ఫాంటసీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Netflix New Series : వైవిధ్య భరితమైన కంటెంట్ ను అందించడంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మొదటి సారి.. ఓ యాక్షన్ ఫాంటసీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ కంటెంట్స్ తో నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంది. ఎప్పటికప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కొత్త మూవీస్ , సిరీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి, ఈ క్రమంలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మొదటి సారి.. ఓ యాక్షన్ ఫాంటసీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేసింది. అది కూడా తెలుగు దర్శకులు నిర్మిస్తున్న ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్ కావడంతో.. ఇప్పటినుంచే ఈ సిరీస్ పై బజ్ స్టార్ట్ అయింది. తెలుగు దర్శకులు రాజ్ , డీకే గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఈ కొత్త సిరీస్ ను నిర్మిస్తున్నారు. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు వస్తుంది. అనే అప్ డేట్స్ తెలుసుకుందాం.

“మీ రక్తాన్ని మరిగించే ఓ పెద్ద న్యూస్ మా దగ్గర ఉంది. మా తొలి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ను అనౌన్స్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాం” అనే ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో నెట్ ఫ్లిక్స్.. ఆసక్తి కరమైన ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్ పేరు “రక్త్ బ్రహ్మాండ్ – ది బ్లడీ కింగ్‌డమ్”. కాగా రాజ్ & డీకే ఈ సిరీస్ ను నిర్మిస్తుండగా .. తుంబాద్ మూవీ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్ ను గమనిస్తే.. ఈ వెబ్ సిరీస్ పూర్తిగా యాక్షన్ అంశాలతో రక్తపాతంతో.. ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ప్రస్తుతం ఈసిరీస్ షూటింగ్ లో ఉన్నట్లు సమాచారం . త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రివీల్ చేయనున్నారు మేకర్స్.

ఇక రక్త్ బ్రహ్మాండ్ – ది బ్లడీ కింగ్‌డమ్ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఓ రాజ్యం , ఆ కిరీటం కోసం జరిగే యుద్ధం ఈ కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఇలాంటి జోనర్ లో తాము కథను అందించలేదని.. వారి చిన్నతనంలో విన్న రాజ్యాలు , యుద్దాలను తలపించేలా ఈ సిరీస్ ను నిర్మించాలని అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు రాజ్ , డీకే. చూడబోతుంటే ఈ తెలుగు దర్శకులు ఎదో గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఇక రిలీజ్ తర్వాత కానీ తెలియదు ఈ సిరీస్ ఏ మేరకు.. ప్రేక్షకులను మెప్పిస్తుంద అని. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments