iDreamPost
android-app
ios-app

Mirzapur 3: OTTలోకి వచ్చేసిన సూపర్‌ హిట్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ 3.. మీరు చూశారా.!

  • Published Jul 05, 2024 | 9:40 AM Updated Updated Jul 05, 2024 | 9:40 AM

ప్రేక్షకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ వివరాలు..

ప్రేక్షకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 9:40 AMUpdated Jul 05, 2024 | 9:40 AM
Mirzapur 3: OTTలోకి వచ్చేసిన సూపర్‌ హిట్‌ సిరీస్‌ మీర్జాపూర్‌ 3.. మీరు చూశారా.!

ఓటీటీలకు విపరీతమైన క్రేజ్‌ పెరుగుతోంది. నేటి కాలంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వారి కన్నా ఓటీటీల్లో వచ్చే మూవీలు, సిరీస్‌ల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక వీకెండ్‌ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్‌లను తీసుకొస్తున్నాయి. దానితో పాటు కేవలం ఓటీటీల కోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న సిరీస్‌లలో మీర్జాపూర్‌ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్‌లు విడుదలయ్యి భారీ విజయం సాధించాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు మూడో సీజన్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న వేళ.. మీర్జాపూర్‌ 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. గురువారం అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ వివరాలు..

ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న సిరీస్‌ల జాబితాలో మీర్జాపూర్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్‌లు విడుదల కాగా.. మూడో సీజన్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక మీర్జాపూర్ 3 కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మీర్జాపూర్ సిరీస్‌లోని మూడవ సీజన్ శుక్రవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రసుత్తం మీర్జాపూర్‌ సీజన్‌ 3.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ మీర్జాపూర్ మొదటి సీజన్ 2018 నవంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా హిందీలో వచ్చిన ఈ సిరీస్‌.. సూపర్‌ డూపర్‌ హిట్టు అయ్యింది. దాంతో అన్ని భారతీయ భాషల్లోకి డబ్‌ చేయడంతో.. ఈ సిరీస్‌ అందరికి చేరువయ్యింది. విపరీతమైన హింస, బూతులు ఉన్నప్పటికి కూడా ప్రేక్షకులు ఈ సిరీస్‌కు కనెక్ట్‌ అయ్యారు.

ఇక మీర్జాపూర్‌ సీజన్‌ 2 2021 అక్టోబర్ లో వచ్చింది. ఆ తర్వాత నుంచి మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సిరీస్‌ బాగా ఆలస్యం అయ్యింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. మూడో సీజన్ వచ్చింది. ఇక 3వ సీజన్‌లో సుమారు పది ఎపిసోడ్లు ఉన్నాయి. గురుమిత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫైజల్, శ్వేత త్రిపాఠి, రసిక దుగ్గల్, విజయవర్మ ఇషా తల్వార్ వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఊహాజనిత మీర్జాపూర్ అనే ప్రాంతంలో ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా సిరీర్‌గా తెరకెక్కిన ఈ మూడవ సీజన్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకోబోతోంది అనేది చూడాలి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో మీర్జాపూర్‌ సీజన్‌ 3 చూసి ఎంజాయ్‌ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş