iDreamPost
android-app
ios-app

మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్ అబ్రహామింతే సంతాతికల్ ఇప్పడు తెలుగులో..

  • Published Aug 08, 2024 | 11:26 AM Updated Updated Aug 08, 2024 | 11:26 AM

OTT Crime Thriller In Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఆరేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ అబ్రహామింతే సంతాతికల్ అనే మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Crime Thriller In Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఆరేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ అబ్రహామింతే సంతాతికల్ అనే మూవీ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 08, 2024 | 11:26 AMUpdated Aug 08, 2024 | 11:26 AM
మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్ అబ్రహామింతే సంతాతికల్ ఇప్పడు తెలుగులో..

ప్రస్తుతం ఓటీటీ లో కూడా తెలుగు సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఎదో ఒక తెలుగు మూవీ లేదా తెలుగు సిరీస్ ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఆల్రెడీ ఇతర భాషల్లో రిలీజ్ అయినా సినిమాలు.. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఇంట్రెస్టింగ్.. క్రైమ్ థ్రిల్లర్ యాడ్ అయిపోతుంది. ఆరేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన అబ్రహామింతే సంతాతికల్ అనే సినిమాకు ఇప్పుడు తెలుగు వెర్షన్ రాబోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

అబ్రహామింతే సంతాతికల్ అనే ఈ సినిమాను తెలుగులో డెరిక్ అబ్రహాం పేరుతో ఓటీటీ లోకి రానుంది. మలయాళంలో 2018 లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.40కోట్ల కలెక్షన్లతో భారీ సక్సెస్ సాధించింది. కేవలం రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ మేకర్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కాగా ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అన్సోన్ పౌల్, కనిక, తరుషి ఝా, రెంజీ పనికర్, యోగ్ జపీ, కళాభవన్ షాజోన్, సురేశ్ కృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఇన్నేళ్లకు ఈ సినిమా తెలుగు వెర్షన్ ను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో ఆగష్టు 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. కచ్చితంగా ఓటీటీ తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆ ఊరిలో వరుసగా 9 అనుమానాస్పద హత్యలు జరగడంతో.. ఆ కేసులను మమ్ముట్టి టెక్ ఓవర్ చేస్తారు. ఇంకొక మర్డర్ జరగకముందే ఈ దారుణాలను ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఈ కేసులో నిందితుడైన సైమన్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేస్తారు . కానీ జైల్లో ఉండగానే సైమన్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీనితో మమ్ముట్టి సస్పెండ్ అవుతాడు. కొద్దీ రోజుల తర్వాత మళ్ళీ విధుల్లోకి వెళ్లిన తర్వాత .. ఈసారి అనుకోకుండా అతని తమ్ముడు తన గర్ల్ ఫ్రెండ్ ను చంపినా కేసులో అరెస్ట్ అవుతాడు. అయితే ఆ హత్య ఆయన చేయకపోయినా కూడా.. ఆధారాలు లేకపోవడంతో కేసు బలంగా మారుతుంది. మరి మమ్ముట్టి తన తమ్ముడిని బయటకు తీసుకువచ్చాడా లేదా ? జైల్లో ఉన్న సైమన్ ఎలా చనిపోయాడు ? సైమన్ ఆ హత్యలను ఎందుకు చేసాడు ? అసలు హత్యలు చేస్తుంది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే . మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş