iDreamPost
android-app
ios-app

OTT లోకి మలయాళీ పొలిటికల్ సెటైర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 20, 2024 | 10:08 AM Updated Updated Jun 20, 2024 | 10:08 AM

Malayalee From India OTT: మలయాళీ సినిమాలు తెలుగు వారి మదిని కూడా దోచేస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంత మలయాళీ సినిమాలదే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మలయాళీ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Malayalee From India OTT: మలయాళీ సినిమాలు తెలుగు వారి మదిని కూడా దోచేస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంత మలయాళీ సినిమాలదే. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మలయాళీ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 20, 2024 | 10:08 AMUpdated Jun 20, 2024 | 10:08 AM
OTT లోకి మలయాళీ పొలిటికల్ సెటైర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఏ ప్లాట్ ఫార్మ్ లో చూసిన కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి. ఇక వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి మలయాళీ సినిమాలే. ఇప్పుడు మలయాళీ సినిమాలు ఇట్టే ప్రేక్షకుల మదిని దోచేస్తున్నాయి. కేవలం ఓటీటీ లోనే కాకుండా అటు తెలుగు థియేటర్స్ లోను ఈ సినిమాలు మంచి టాక్ సంపాదించుకుంటున్నాయి. ఇక ఓటీటీ ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మలయాళీ సినిమా స్ట్రీమింగ్ రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మలయాళీ సినిమా పేరు “మలయాళీ ఫ్రమ్ ఇండియా”. ఈ సినిమా మే 1న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుని. థియేటర్స్ ఓ మంచి కలెక్షన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమాలు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. వారితో పాటు దీపక్ జేతీ, సలీమ్ కుమార్, మంజు పిళ్లై, షైన్ టామ్ చాకో, సంతోష్ జీ కూడా ప్రధాన పాత్రలలో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జులై 5 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు స్ట్రీమింగ్ చేయనున్నట్లు.. అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఆల్పరంబిల్ గోపీ అనే వ్యక్తి నిరుద్యోగిగా ఉంటాడు. క్రికెట్ ఆడుతూ.. ఓ రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఓ సమయంలో ఆ గ్రామంలో హిందువులు, ముస్లింల మధ్య గొడవలు మొదలవుతాయి. గోపి, అతని స్నేహితుడు కూడా చెరొక వర్గం నుంచి గొడవలకు దిగుతారు, దింతో పోలీసుల బారి నుంచి గోపిని కాపాడేందుకు.. అతనిని విదేశాలకు పంపుతారు అతని కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏం జరిగింది ! గోపిలో ఎలాంటి మార్పు వచ్చింది! అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.