Tirupathi Rao
Malayalam Thriller Keechurallu OTT Review In Telugu: మలయాళం సినిమాలుక తెలుగులో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఓటీటీలో మలయాళం మూవీస్ కి ఆడియన్స్ పెరిగిపోయారు. మరి తెలుగులో వచ్చిన ఈ మలయాళం మూవీ ఎలా ఉందో చూద్దాం.
Malayalam Thriller Keechurallu OTT Review In Telugu: మలయాళం సినిమాలుక తెలుగులో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఓటీటీలో మలయాళం మూవీస్ కి ఆడియన్స్ పెరిగిపోయారు. మరి తెలుగులో వచ్చిన ఈ మలయాళం మూవీ ఎలా ఉందో చూద్దాం.
Tirupathi Rao
ప్రస్తుతం థియేటర్ అయినా.. ఓటీటీ అయినా అంతా మలయాళం మూవీస్, మలయాళం థ్రిల్లర్స్ అంటేనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అందుకే మలయాళం సినిమాలు తెలుగు ఓటీటీల్లోకి విరివిగా వస్తున్నాయి. అలాగే ఈ మూవీ కూడా వచ్చింది. ఇది ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్టు అయింది. అందుకే తెలుగు ప్రేక్షకుల కోసం దీనిని డబ్ చేసి తెలుగులో కీచురాళ్లుగా తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఈ కీచురాళ్లు మూవీ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఆకట్టుకోగలుగుతుందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
ఈ మూవీలో హీరోయిన్ రాధిక(రజీషా విజయన్) ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పెర్ట్. ఆమె సొంతంగా ఒక స్టార్టప్ ని కూడా స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా.. పోలీసులే వివిధ కేసుల్లో అవసరాన్ని బట్టి రాధిక సాయం తీసుకుంటూ ఉంటారు. ఆమె టెక్నాలజీ సాయంతో మనుషులను చదవడంలో ఎక్స్ పర్ట్. అలాంటి యువతికే కొందరు ఆకతాయిల నుంచి వేధింపులు స్టార్ట్ అవుతాయి. అసభ్యకరమైన మెసేజులు, చెప్పుకోలేని భాషలో ఫోన్లు చేసి వేధించడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆ విషయంలో న్యాయవాది అయిన తండ్రి కూడా కుమార్తెకు సహాయం చేయడం. వారిని కదిలిస్తే ఇంకా ఏం చేస్తారో అనే భయాన్ని వ్యక్త పరుస్తారు. అయినా రాధిక మాత్రం ఒంటరిగానే వారిపై యుద్ధానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఈ మూవీ ఒక రౌడీ మూక ఉంటుంది. వాళ్లు స్క్రాప్ బిజినెస్ పేరిట పలు మోసాలు, అన్యాయాలు చేస్తూ ఉంటారు. ఈ గూండాలతోనే రాధికాకి తలనొప్పులు వస్తాయి. అసలు వీళ్లకి- రాధికాకి ఎందుకు గొడవ స్టార్ట్ అయ్యింది? వారిని ఎలా ఎదుర్కొంది? ఈ సినిమాలో టెక్నాలజీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
డైరెక్టర్ చాలా మంచి పాయింట్ ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదు. ఆకతాయిల నుంచి అమ్మాయిలకు వేధింపులు అనేవి ఎప్పటి నుంచో చూస్తున్నవే. అయితే ఇప్పుడు కాస్త తగ్గాయి అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాని ఒక సైబర్ ఎక్స్ పర్ట్ కి కాకుండా.. ఒక సాధారణ యువతికి తలెత్తినట్లు చూయించి ఉంటే ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేది. అయినా ఈ మూవీలో కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మూవీ ఓపెనింగ్ లోనే మంచి ఆసక్తి స్టార్ట్ అవుతుంది. కానీ, ఆ ఇంట్రెస్ట్ ని క్యారీ చేస్తూ స్టోరీలోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు.
సినిమాలో సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. కానీ, కథ మాత్రం స్లోగా సాగడంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్లు ఉంటుంది. అమ్మాయి విషయంలో సగటు తండ్రి పడే భయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడు ప్రశ్నిస్తే మరోసారి ఏం చేస్తారో అనే భయాన్ని రాధికా తండ్రి పాత్రతో బాగా పలికించారు. ఎవరి సపోర్ట్ లేకుండా రిధాకా చేసే పోరాటం మెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిగా సాగుతుంది. అలాగే ద్వితీయార్థం మరింత మెప్పిస్తుంది. అన్నీ బాగానే ఉన్నా.. విలనిజంలో మాత్రం ఈ మూవీ నిరాశ పరుస్తుంది. అంటే ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్ హెడ్ ఎవరు? అసలు అతని స్టామినా ఏంటి? ఏం చేయగలడు? అనే పాయింట్స్ ఇంకా లోతుగా, ఎలివేషన్స్ తో ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా.. బాగా హై ఇచ్చే సీన్స్ సగటు ప్రేక్షకుడు ఊహించే విధంగా ఉండటం కూడా ఒక మైనస్ అని చెప్పాలి.
హీరోయిన్ రజీషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో రజీషాకే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. ఉన్నంత వరకు మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాధికా తండ్రిగా చేసిన శ్రీనివాసన్, పోలీసులు, రౌడీ మూకలుగా చేసిన అంతా వారి పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంటారు. అలాగే డైరెక్టర్ రాహుల్ హీరోయిన్ సహోద్యోగిగా చేసిన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. కథతో డైరెక్టర్ ఆకట్టుకోగలిగాడు. కానీ, వందకి వంద శాతం మాత్రం కాదు. ఇంక టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. సంగీంత పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాని మరీ ల్యాగ్ చేయకుండా ఎడిట్ చేయడం ప్లస్ పాయింట్.
చివరిగా: రాధిక పోరాటాన్ని ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడచ్చు.
రేటింగ్: 2.5/5