Krishna Kowshik
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీకెండ్ వస్తే చాలు.. ఇలాంటి మూవీస్ ఏమన్నా సందడి చేస్తున్నాయా అని ఓటీటీల్లో సెర్చ్ చేస్తున్నారు. గతంలో మిస్ అయిన వాటిని కూడా వాచ్ చేస్తుంటారు. అయితే ఇది మస్ట్ వాచ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీకెండ్ వస్తే చాలు.. ఇలాంటి మూవీస్ ఏమన్నా సందడి చేస్తున్నాయా అని ఓటీటీల్లో సెర్చ్ చేస్తున్నారు. గతంలో మిస్ అయిన వాటిని కూడా వాచ్ చేస్తుంటారు. అయితే ఇది మస్ట్ వాచ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.
Krishna Kowshik
ఇటీవల కాలంలో మాలీవుడ్ చిత్రాలకు ఫ్యాన్ బేస్ పెరిగింది. మలయాళ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఏ జోనర్ చిత్రాలైనా సరే కాస్త నచ్చినా ఎంజాయ్ చేస్తుంటారు మూవీ లవర్స్. భారీ యాక్షన్ ఎలివేషన్స్ ఉండనక్కర్లేదు, హీరోయిజం అవసరం లేదు. సినిమా పాటలు రిచ్ లోకేషన్లలో తీయనక్కర్లేదు. చెవులు పగిలిపోయే అంత మ్యూజిక్ ఉండనక్కర్లేదు. నెరేషన్ స్లోగా ఉన్నా పర్లేదు.. గ్రిప్పింగ్ సీన్స్, మైండ్ పోయే బీజీఎం ఉంటే చాలు విపరీతంగా చూస్తున్నారు. ముఖ్యంగా కోర్టు డ్రామా, క్రైమ్ చిత్రాలను బాగా వాచ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఓటీటీలో అలాంటి జోనర్ చిత్రాలు ఏమన్నా ఇటీవల వచ్చాయా అని చూస్తున్నారు. ఈ వీకెండ్ మీ కోసం అలాంటి ఇంట్రస్టింగ్ స్టోరీతో సాగిపోయే క్రైమ్ డ్రామా ఓటీటీలో సందడి చేస్తోంది చూసేయండి.
ఆకాశమే నీ హద్దురా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అపర్ణా బాల మురళి. ఈ మూవీలో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డు వచ్చిన సంగతి విదితమే. తమిళ్, మలయాళంలో మంచి రోల్స్ చేస్తూ టాప్ హీరోయిన్‌గా మారింది. ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇని ఉత్తరం. 2022లో అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఓటీటీలోకి వచ్చి సందడి చేసింది. ఇటీవల తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అదృశ్యం పేరుతో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 4 నుండి ఈటీవీ విన్‌లో సందడి చేస్తోంది. ఖుషీ, హాయ్ నాన్న, మనమే చిత్రాలకు మ్యూజిక్ అందించిన హేషమ్ ఈ మూవీకి బాణీలు అందించారు. ఇక కథ విషయానికి వస్తే..
జానకి (అపర్ణ బాలమురళి) అశ్విన్ ( సిద్ధార్థ్ మీనన్) ప్రేమించుకుంటారు. జానకి డాక్టర్‌గా పనిచేస్తూ ఉంటుంది. అశ్విన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ సహజీవనం చేస్తారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వీరికి ఫ్రెండ్ వివేక్ సపోర్టు చేస్తుంటాడు. అయితే ఓ రోజు వివేక్‌ను తానే చంపానంటూ పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. వారం రోజుల క్రితం హత్యచేశానని సీఐ కరుణన్ (కళాభవన్ షాజోన్)కి చెబుతుంది. అక్కడి సమీపంలోని అటవీ ప్రాంతంలో వివేక్ శవాన్ని పాతిపెట్టానని అంటుంది. తొలుత ఆమె మెంటల్ కండీషన్ బాలేదని భావిస్తాడు సీఐ కరుణన్. కానీ జానకి హత్య వార్త మీడియాలో హైలెట్ అవుతుంది. వివేక్‌ను చంపి పాతిపెట్టిన ప్లేస్‌కు జానకితో పాటు వెళతారు పోలీసులు. అక్కడ వివేక్ డెడ్‌బాడీ కాకుండా ఓ చర్చి ఫాదర్‌తో పాటు ఆమె లవర్ అశ్విన్ డెడ్‌బాడీలు దొరుకుతాయి. ఈ కేసును ఎస్పీ (హరీష్ ఉత్తమన్)టేకప్ చేస్తాడు. ఇంతకు అశ్విన్, చర్చి ఫాదర్లను జానకి చంపింది ఎవరు?వేరొకరు హత్య చేశారా.? వివేక్ హత్యకు.. కరుణన్ కు సంబంధం ఏంటీ తెలియాలంటే ఓటీటీలో చూడండి.