Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజులలోపే ఓటీటీ బాట పడుతున్నాయి. దీనితో ఎంత థియేటర్ లో సినిమాలను చూసిన కానీ.. అవి ఓటీటీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా విజయ్ నటించిన మహారాజ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది.
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజులలోపే ఓటీటీ బాట పడుతున్నాయి. దీనితో ఎంత థియేటర్ లో సినిమాలను చూసిన కానీ.. అవి ఓటీటీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయా అని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా విజయ్ నటించిన మహారాజ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది.
Swetha
ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో ఓటీటీ లదే హావ. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కొన్నైతే.. థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు మరికొన్ని. దాదాపు మూవీ లవర్స్ అంతా కూడా థియేటర్ లో వచ్చిన సినిమాలను వచ్చినట్లు చుడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు థియేటర్ తో పాటు.. ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ కి వస్తుందా అని కూడా అంతే ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్ మూవీస్ కూడా ఓటీటీ లవర్స్ ని అంతే ఆశ్చర్య పరుస్తున్నాయి. థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా గురించి.. ఇలాంటి టాక్ ఏ నడుస్తుంది. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో చూసేద్దాం.
విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా.. జూన్ 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. స్ట్రైట్ సినిమాలను సైతం ఈ డబ్బింగ్ మూవీ క్రాస్ చేసి.. థియేటర్స్ లో ఆడియన్స్ మధ్యన ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. దీనితో ఈ సినిమాపై రోజు రోజుకు మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకుడిగా వ్యవహరించారు. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నెల రోజులలోపే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ సినిమా జూలై మొదటి వారం లేదా రెండవ వారంలోనే స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. థియేట్రికల్ రన్ ను బట్టి.. ఈ డేట్స్ మారే అవకాశం కూడా ఉంది.
ఇక మహారాజ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో విజయ్ మహారాజ అనే ఓ బార్బర్ పాత్రలో నటించారు. మహారాజ భార్య చనిపోయిన తర్వాత అతను తన కూతురు జ్యోతితో కలిసి జీవిస్తూ ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలో ఓ రోజు సడన్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. తనపై ఓ ముగ్గురు దాడి చేసారని.. తన కూతురిని , కాపాడిన లక్ష్మిని అపహరించారని.. ఎలాగైనా లక్ష్మిని కాపాడాలని .. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. అయితే లక్ష్మి గురించి మాత్రం సరిగ్గా చెప్పడు. దీనితో పోలీసులు కంప్లైంట్ తీసుకునేందుకు ఆలోచిస్తారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుంటారు. అసలు మహారాజ పై దాడి చేసింది ఎవరు ! తనకు ఉన్నది ఒక కూతురే కదా లక్ష్మి ఎవరు ! లక్ష్మి అంటే డబ్బా లేక మనిషా ! చివరికి లక్ష్మిని పెట్టుకున్నారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.