Swetha
This Week Telugu Movies In OTT: ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలలో బెస్ట్ సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.
This Week Telugu Movies In OTT: ఈ వారం ఓటీటీ లోకి చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఓటీటీ లోకి వచ్చిన అన్ని సినిమాలలో బెస్ట్ సినిమాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.
Swetha
ఓటీటీ లో ప్రతి వారం కొత్త సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక వాటిలో ఈ వారం ఈ సినిమాలను అసలు మిస్ చేయొద్దు అంటూ .. కొన్ని మూవీ సజ్జెషన్స్ కూడా వస్తూనే ఉంటాయి. ప్రతి వారం ఇరవై కి పైగా సినిమాలు ,సిరీస్ లు వచ్చినా కానీ.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. అలా ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు మొత్తం తొమ్మిది ఉన్నాయి. వాటిలో రెండు సినిమాలు మాత్రం.. థియేటర్ లో ఊహించని విధంగా సక్సెస్ సాధించాయి. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాలను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
భారీ అంచనాల మధ్యన.. రవి తేజ నటించిన ఈ సినిమా ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఊహించని విధంగా ఈ మూవీ మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. మొదటి రోజు నుంచే ఇలాంటి టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. దీనితో ఈ మూవీని ఓటీటీ లోకి వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వారే ఎక్కువయ్యారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.
తారక్ బావమరిది నితిన్ నార్నె రెండో సినిమా ఇది. పెద్ద సినిమాల మధ్యన రిలీజ్ చేస్తూ.. నితిన్ నార్నె సాహసం చేస్తున్నారని అంతా.. కానీ.. ఆ వీక్ లో రిలీజ్ అయినా సినిమాలలో .. ఆయ్ మూవీనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. క్యాస్టింగ్ , బడ్జెట్ తో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ను మాత్రమే.. ప్రేక్షకులు ఆదరిస్తారని.. ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ చేసిన వారు.. ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే.
ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది. ఇండియన్ క్రైమ్ హిస్టరీలోనే.. నిఠారి కేస్ ఎంతో భయంకరమైనది. 2006 లో జరిగిన ఈ సంఘటన దేశం మొత్తాన్ని భయంతో వణికించింది. ఈ సినిమాలో ఈ కేసు ఎలా జరిగింది.. దీనిని ఎలా సాల్వ్ చేశారు అనే అంశాలను క్లియర్ గా చూపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఇష్టపడుతుంటారు కాబట్టి.. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ మూవీని అసలు మిస్ చేయకుండా చూసేయండి.
అసలు గత నెలలో చిన్న సినిమాల హావ మొదలైందే.. ఈ సినిమాతో. మొత్తం 11 మంది కొత్త నటి నటులతో.. కొత్త దర్శకుడు తీసిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పించింది. చిన్న సినిమాగా థియేటర్ కు వచ్చిన ఈ మూవీ నోస్టాలజిక్ బ్లాక్ బస్టర్ గా సూపర్ హిట్ సాధించింది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ చేసిన వారు.. అసలు మిస్ చేయకుండా చూసేయండి. కచ్చితంగా ఈ మూవీ అందరికి బాల్యాన్ని గుర్తుచేస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ ఐటీ జాబ్ లో జాయిన్ అయినా.. ప్రతి ఒక్కరికి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సాధారణంగా ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఉద్యోగులను బెంచ్ లో ఉన్నట్లుగా చెప్తారు. దీనిపై చాలా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్ మీదనే ఓ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ కు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప్పుడు మరొక వెబ్ సిరీస్. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా మలయాళీ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను మలయాళీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ “తలవన్” ఓటీటీ లోకి వచ్చేసింది. వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఈ సినిమాలు కాకుండా .. డైరెక్ట్ గా ఓటీటీ లో రీలీజ్ కానున్న బెర్లిన్ మూవీ.. అలాగే కీర్తి సురేష్ నటించిన రఘుతాత సినిమాలు జీ5 లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ గోలి సోడా రైజింగ్ వెబ్ సిరీస్ లను కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.