iDreamPost
android-app
ios-app

కొత్త లోక OTT బజ్.. దుల్కర్ ఏమన్నారంటే !

  • Published Sep 22, 2025 | 12:38 PM Updated Updated Sep 22, 2025 | 12:38 PM

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ .. ఓ నెల లోపే ఓటిటి లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. గట్టిగా చెప్పాలంటే సినిమాల రిలీజ్ ల డేట్స్ ను ఓటిటి లు డిసైడ్ చేస్తున్నాయని. నిర్మాతలు ఓటిటి ల చేతిలో కీలుబొమ్మలు అయిపోతున్నారనే టాక్ నడిచింది

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ .. ఓ నెల లోపే ఓటిటి లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. గట్టిగా చెప్పాలంటే సినిమాల రిలీజ్ ల డేట్స్ ను ఓటిటి లు డిసైడ్ చేస్తున్నాయని. నిర్మాతలు ఓటిటి ల చేతిలో కీలుబొమ్మలు అయిపోతున్నారనే టాక్ నడిచింది

  • Published Sep 22, 2025 | 12:38 PMUpdated Sep 22, 2025 | 12:38 PM
కొత్త లోక OTT బజ్.. దుల్కర్ ఏమన్నారంటే !

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ .. ఓ నెల లోపే ఓటిటి లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. గట్టిగా చెప్పాలంటే సినిమాల రిలీజ్ ల డేట్స్ ను ఓటిటి లు డిసైడ్ చేస్తున్నాయని. నిర్మాతలు ఓటిటి ల చేతిలో కీలుబొమ్మలు అయిపోతున్నారనే టాక్ నడిచింది. పెద్ద పెద్ద సినిమాలు సైతం థియేటర్ రిలీజ్ తర్వాత ఓ నెలకే ఓటిటి లకు రావడంతో.. ప్రేక్షకులలో కూడా థియేటర్స్ కు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దీనితో ఇప్పుడు ట్రెండ్ మారుస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లిటిల్ హార్ట్స్ వెంటనే ఓటిటిలోకి రాదనీ చెప్పేసారు.

ఇక ఇప్పుడు ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కొత్త లోక కూడా ఇదే బాట పట్టింది. ళ్యాణి ప్రియదర్శన్ తొలిసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లేడీ సూపర్ హీరో అనే కాన్సెప్ట్ తో ‘ లోక చాప్టర్ 1: చంద్ర’ అంటూ మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిని తెలుగులో కొత్తలోక అంటూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి రోజు మొదటి షో నుంచే విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇది త్వరలోనే ఓటిటికి రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో మూవీ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఇలా రెస్పాండ్ అయ్యారు.

” థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా ఓటీటీలోకి రావడం సహజమే. కానీ కొత్తలోక త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మకండి. ఓటీటీలోకి వచ్చే ముందు కచ్చితంగా మీకు అధికారికంగా తెలియజేస్తాము” అంటూ దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా ఇప్పట్లో ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటిటి లో చూడాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.