iDreamPost
android-app
ios-app

OTT లో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

  • Published Jul 24, 2024 | 5:30 AM Updated Updated Jul 24, 2024 | 5:30 AM

OTT Sci-Fi Movie : ఓటీటీ లో తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోను హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూడడానికి ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ బాలీవుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ గా ఉంది.

OTT Sci-Fi Movie : ఓటీటీ లో తెలుగు సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోను హాలీవుడ్ సినిమాలను తెలుగులో చూడడానికి ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ బాలీవుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ గా ఉంది.

  • Published Jul 24, 2024 | 5:30 AMUpdated Jul 24, 2024 | 5:30 AM
OTT లో హాలీవుడ్  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. తెలుగులో కూడా!

ప్రస్తుతం ఓటీటీ లలో తెలుగు కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వారం ఎదో ఒక తెలుగు మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. పైగా ప్రేక్షకులలో తెలుగు కంటెంట్ పై పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఇతర భాషల చిత్రాలను కూడా తెలుగులో అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఎంతైనా ఇతర భాషల చిత్రాలను తెలుగులో చూస్తే ఆ కిక్ ఏ వేరు అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. పైగా తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు..”కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్”. ఈ సినిమా 2024లో విడుదల అయింది. ఈ సినిమాకు.. వెస్ బాల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ.. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే సినిమాకు సిక్వెల్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజిలో వచ్చిన సినిమాలన్నిటిని చూసి ఉంటారు. ఇక ఈ సినిమాలో ఓవెన్ టీగ్, ఫ్రెయా అలన్, కెవిన్ డ్యూరాండ్, పీటర్ మాకాన్ , విలియం హెచ్. మాసీ నటించారు. ఆల్రెడీ ఈ సిరీస్ పై అవగాహనా ఉన్న వారికి ఈ నటి నటుల గురించి తెలిసి ఉంటుంది. ఇక 2024 లో రిలీజ్ అయినా కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా ఆగష్టు 2 నుంచి తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీస్ టైమ్ లైన్ 2011 లో స్టార్ట్ అవుతుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ బయో టెక్నలాజి కంపెనీలో.. ఒక అతను వర్క్ చేస్తూ ఉంటాడు. అతను గత ఆరేళ్ళ నుంచి ఆల్జీమర్స్ అని ఓ వ్యాధిని క్యూర్ చేయడానికి.. ఓ మెడిసిన్ ను తయారు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకు ఆ వ్యాధి ఉంటుంది. దానిని క్యూర్ చేయడానికి ఆ మెడిసిన్ ను తయారు చేసి.. దానిని ఓ చింపాంజీ మీద ట్రై చేస్తాడు. మెల్లగా దానికి మనిషి లక్షణాలు వస్తాయి. దానికి ఓ బేబీ కూడా పుడుతుంది. అయితే ఒకానొక క్రమంలో ఆ చింపాంజీ చనిపోడంతో. ఈ బేబీ చింపాంజీని హీరో ఇంటికి తీసుకుని వెళ్లి పెంచుకుంటాడు. మెల్లగా ఆ బేబీ చింపాంజీ కూడా మనిషిలా అన్ని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది .. అతను ఆ మెడిసిన్ తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడా లేదా.. బేబీ చింపాంజీ చేసిన పనులు ఏంటి అనేది అనేది తెరపై చూడాల్సిన కథ. ఇప్పటికి ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ఇది నాలుగో మూవీ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.