iDreamPost
android-app
ios-app

OTT లోకి కీర్తి సురేష్ పొలిటికల్ క్రైమ్ కామెడీ డ్రామా ‘రఘు తాత’ .. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Sep 10, 2024 | 2:45 AM Updated Updated Sep 10, 2024 | 2:45 AM

Raghu Thatha Movie OTT Streaming Date: థియేటర్స్ లో చిత్రాలను ఒరిజినల్ భాషలో రిలీజ్ చేసినా కానీ.. ఓటీటీ లో మాత్రం కచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. అలాంటి డబ్బింగ్ సినిమాల లిస్ట్ లోకి ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన ఓ ఇంట్రెస్టింగ్ రీసెంట్ మూవీ యాడ్ అవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Raghu Thatha Movie OTT Streaming Date: థియేటర్స్ లో చిత్రాలను ఒరిజినల్ భాషలో రిలీజ్ చేసినా కానీ.. ఓటీటీ లో మాత్రం కచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. అలాంటి డబ్బింగ్ సినిమాల లిస్ట్ లోకి ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన ఓ ఇంట్రెస్టింగ్ రీసెంట్ మూవీ యాడ్ అవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 10, 2024 | 2:45 AMUpdated Sep 10, 2024 | 2:45 AM
OTT లోకి కీర్తి సురేష్ పొలిటికల్ క్రైమ్ కామెడీ డ్రామా ‘రఘు తాత’ .. స్ట్రీమింగ్ డేట్ ఇదే

కంటెంట్ బావుంటే కనుక సినిమాలు , సిరీస్ లు ఏ భాషలో ఉన్న బాగా హిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. అందులోను అవి తెలుగులో ఉంటె రీచ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ క్రమంలో థియేటర్స్ లో కొన్ని చిత్రాలను ఒరిజినల్ భాషలో రిలీజ్ చేసినా కానీ ఓటీటీ లో మాత్రం కచ్చితంగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అవ్వబోతుంది. ఆ మూవీ మరేదో కాదు కీర్తి సురేష్ రీసెంట్ గా నటించిన రఘు తాత మూవీ. మరి ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

రఘు తాత మూవీ ఆగష్టు 15న తమిళంలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ పొలిటికల్ క్రైమ్ కామెడీ డ్రామా ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు కూడా.. ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. దీనితో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే అదే సమయంలో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. సరిగ్గా అప్పుడే తెలుగులో స్ట్రైట్ సినిమాలు ఉండడంతో.. కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి.. తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ గా ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు. అయితే తమిళంలో ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోవడంతో.. తెలుగులో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ఆశతో ఉన్నారు మేకర్స్ . ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 13 నుంచి తమిళం , తెలుగుతో పాటు.. కన్నడలో కూడా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా… 1960 బ్యాక్డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే రాజకీయ అంశం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. పైగా ఈ సినిమాలో రాజకీయంతో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఇక ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు.. ఎంఎస్ భాస్కర, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ ప్రధాన పాత్రలలో నటించారు. తమిళంలో ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా.. కీర్తి సురేష్ నటనకు మాత్రం ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)